Cinema Shootings Bundh: తెలుగు సినిమాలకే కాదు.. ఇతర భాషల సినిమాలకూ తప్పలేదు!

Bundh effect on Movie shootings: ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ సమ్మెకు దిగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ దశలో ఉన్న అన్ని సినిమాలు ఆగిపోయాయి. కేవలం తెలుగు సినిమాలే కాక హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటున్న తమిళ, హిందీ సినిమా షూట్స్ కూడా నిలిచిపోయాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2022, 01:06 PM IST
  • సమ్మెకు దిగిన ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్
  • తెలుగు సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిపివేత
  • బాలీవుడ్, తమిళ సినిమాలకూ తప్పని ఎఫెక్ట్
Cinema Shootings Bundh: తెలుగు సినిమాలకే కాదు.. ఇతర భాషల సినిమాలకూ తప్పలేదు!

Bundh effect on Bollywood and Kollywood Movie shootings:
తమ వేతనాల పెంపు కోసం తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ రోజు నుంచి షూటింగ్స్ కు కార్మికులు ఎవ్వరూ హాజరు కాకూడదని నిర్ణయించుకుని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జీతాలు పెంచే వరకు షూటింగ్‌లకు వెళ్లమంటూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేస్తున్నారు. ఒకరు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సంగతి అలా ఉంచితే సినీ కార్మికుల సమ్మెతో రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు ఇతర భాషల సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. 

షూట్లో ఉన్న తెలుగు సినిమాలు 
సమ్మె జరిగితే నష్ట పోయే సినిమాల లిస్టులో అయితే పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. ప్రసుత్తం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టు K షూటింగ్ శంకర్ పల్లి లో జరగాల్సి ఉండగా రద్దయింది. చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమా పఠాన్ చేరు పాశమైలారం దగ్గర విజయ్ ఎలక్ట్రికల్స్ లో జరగాల్సి ఉండగా రద్దయింది. విజయ్ దేవరకొండ- సమంత నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 యాకర్స్ లో జరగాల్సి ఉండగా రద్దయింది. రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగాల్సి ఉండగా రద్దయింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్ చేస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా రద్దయింది. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సి ఉండగా రద్దయింది. అల్లరి నరేష్ ఏఆర్ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న ఇట్లు మారేడు మిల్లీ ప్రజానీకం సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగాల్సి ఉండగా రద్దయింది.
 
ఇతర భాషల సినిమాలు
ఇక హైదరాబాద్ లో షూట్ జరుగుతున్న బాలీవుడ్ సినిమాలు కూడా ఆగిపోయాయి. సల్మాన్ ఖాన్ వెంకటేష్ కభి ఈద్ ఖభి దివాలి సినిమా షూటింగ్ కోకా పెట్ లో జరగాల్సి ఉండగా రద్దయింది. అజయ్ దేవగన్ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సి ఉండగా రద్దయింది. ఇక శివ కార్తికేయన్ -అనుదీప్ కేవీ సినిమా నానక్ రామ్ గూడలో జరగాల్సి ఉండగా రద్దయింది. సీనియర్ హీరో అర్జున్ సినిమా హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా రద్దయింది. ఇక షూటింగ్ త్వరలో జరుపుకోబోయే సినిమాల మీద కూడా ఈ సమ్మె ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. 
 
త్వరలో ప్రారంభమయ్యే సినిమాలు
ప్రభాస్ సలార్ కోసం శంషాబాద్ లో ఒక రిచ్ సెట్ వేశారు, కొత్త షెడ్యూల్ జూలై మొదటి వారం నుంచి జరగాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేశారు, జూలై ఫస్ట్ నుంచి షెడ్యూల్ జరగాల్సి ఉంది. విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న వారసుడు కోసం అన్నపూర్ణ 7 యాకర్స్ లో సెట్ వేశారు, జూలై మొదటి వారం నుంచి షెడ్యూల్ ప్రారంభం కావలసి ఉంది. అజిత్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో సెట్ వేశారు, ఈ సినిమా తాజా షెడ్యూల్ జూలై మొదటి వారం నుంచి జరగాల్సి ఉంది. నాని దసరా సినిమా షూట్ కోసం బాచుపల్లిలో సెట్ వేశారు, ఈ నెలాఖరు నుంచి షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. ప్రస్తుతానికి చిన్న, పెద్దా  సినిమాలు కలిపి 25 వరకు షూటింగ్ దశలో ఉన్నాయని, సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ఆ ఎఫెక్ట్ సినిమాల మీద పడే అవకాశం ఉంది. 

Also Read: Akash puri: ఛార్మి కోసం పూరి విడాకులకు రెడీ.. అసలు విషయం బయట పెట్టేశాడుగా!

Also Read: Chinmayi Sripada: కవలలకు తల్లైన వివాదాస్పద సింగర్.. సరోగసీ కామెంట్స్ పై ఏమందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News