Uddhav thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అనే  హక్కు బీజేపీకు లేదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై సమాధానం చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav thackeray) మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. తమకు హిందూత్వం నేర్పే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. మహారాష్ట్రలో గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లోని మోటేరా స్డేడియానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ పటేల్ పేరు తీసేసి మోదీ పేరు పెట్టడంపై  మండిపడ్డారు. అంతేకాకుండా వీర్ సావర్కర్‌కు భారత రత్న ఇవ్వకుండా ...తమకే హిందూత్వం నేర్పడానికి ప్రయత్నించడంపై ఎద్దేవా చేశారు. 


భారత్ మాతాకీ జై ( Bharat mata ki jai )అంటూ నినాదాలు చేసినంత మాత్రాన మీరు అంటే బీజేపీవాళ్లు దేశభక్తులనుకోవడం సరికాదని చెప్పారు. అసలు భారత్ మాతాకీ జై అనే హక్కే బీజేపీకు లేదని స్పష్టం చేశారు. ముంబాయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టుకున్నామని..బీజేపీ(BJP)మాత్రం ఏకంగా సర్దార్ పటేల్ పేరునే మార్చేసిందని మండిపడ్డారు. 


Also read: Tamilnadu politics: తమిళ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన శశికళ, హాట్‌టాపిక్‌గా మారిన ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook