పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.
మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్‌శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసుపై బాలీవుడ్‌తోపాటు మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
విప్లవ కవి వరవరరావును ( Varavara Rao ) ఉంచిన మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైల్లో ( Taloja central jail ) కరోనావైరస్ తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తుండటంతో పాటు ఆ వ్యాధితో ఒకరు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వమే ( Maharashtra govt ) ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
మహారాష్ట్రలో కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోనే కరోనా ప్రభావం అధికమవుతుండటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రంగా పరిగణిస్తూ బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిని ( BMC Commissioner Praveen Pardeshi ) ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆయనపై బదిలీ వేటు వేశారు.
కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్‌డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 145 సభ్యుల మద్దతు ఏ పార్టీకీ లేకపోవడంతో మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు క్లిష్టంగా మారింది.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపికి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి ఆహ్వానం పలికారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు గెల్చుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినందునే గవర్నర్ భగత్ సింగ్ బీజేపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. నవంబర్ 11వ తేదీలోగా మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు.
కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ నేతలు రామ మందిరం విషయం గురించి మాట్లాడతారని.. మామూలు సందర్భాల్లో వారు ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా భయపడతారని థాక్రే ఎద్దేవా చేశారు.