Etela Meet to Amith shah: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పరిస్థితులను అగ్ర నేతలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈక్రమంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఈసందర్భంగా ఈటల రాజేందర్‌కు అమిత్ షా సూచించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్‌ ఎదురించి నిలబడ్డ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కీలక పదవి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఈక్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొంత మంది కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలతో భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఈటలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారికంగా ప్రకటన రానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రెండురోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. కీలక పదవి ప్రకటన తర్వాతే హైదరాబాద్‌కు ఈటల వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.


Also read:Agnipath: అగ్నిపథ్‌ ద్వారానే ఆర్మీ రిక్రూట్‌మెంట్..కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!


Also read:Teacher dance with Students: విద్యార్థినులతో కలిసి టీచరమ్మ స్టెప్పులు..సోషల్‌ మీడియాలో వైరల్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook