Uma Bharti tests positive for coronavirus: న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనావైరస్ (coronavirus) బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలు సైతం కరోనాతో మరణించారు. అయితే.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి (Uma Bharti) కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు ఆమె ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె వరుస ట్విట్లను చేసి ఈ విధంగా రాశారు. తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని ఉమా భారతి సూచించారు. Also read: Babri Masjid demolition case: 30న బాబ్రీ కేసు తీర్పు



ప్రస్తుతం తాను హరిద్వార్ - రిషికేశ్ మధ్య ఉన్న వందేమాతరం కుంజ్ వద్ద ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆమె తెలిపారు. 4 రోజుల తర్వాత మళ్లీ కోవిడ్ -19  (Covid-19) పరీక్ష చేయించుకుంటానని.. పరిస్థితి అలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తానంటూ ఉమా భారతి ట్వీట్ చేశారు. మూడు రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నానని.. అయితే ఈ రోజుతో హిమాలయ పర్వత ప్రయాణం ముగిసిన వెంటనే వైద్యసిబ్బందిని పిలిచి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఉమాభారతి ట్విట్‌లో తెలిపారు. ఇదిలాఉంటే.. హిమాలయ పర్యటనలో కోవిడ్ -19 నిబంధనలను అనుసరించినప్పటికీ ఆమె కరోనావైరస్ బారిన పడ్డారని బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. Jaswant Singh Dies: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత