Funny tweet: ఇంధన ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొత్తగా సెస్ విధించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బీజేపీ ఎంపీనే స్వయంగా దీనిపై వ్యంగ్యంగా ట్వీట్ చేయడం గమనార్హం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశంలో గత కొద్దిరోజులుగా పెట్రోల్ , డీజిల్ ధరలు ( Petrol - Diesel Prices ) వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో మరీ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటగా..అత్యధిక రాష్ట్రాల్లో సెంచరీకు చేరువలో ఉంది. సరాసరి తీసుకుంటే లీటర్ పెట్రోల్ ధర 92 రూపాయలుంది.  ఇది చాలదన్నట్టు కొత్తగా కేంద్ర బడ్జెట్ ( Union Budget )‌ లో పెట్రోల్ , డీజిల్ మీద వ్యవసాయ పన్ను ( Agri cess on petro and diesel ) విధించారు. దీనిపై ప్రజల్నించి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ పన్నును పెట్రోల్‌పై విధిస్తున్న సుంకం నుంచి మినహాయిస్తామని..అదనంగా భారం మోపమని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman ) తెలిపారు. అయితే ఈ మినహాయింపు ఎంతకాలం ఉంటుందనేది స్పష్టత లేదు. 


ఈ నేపధ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ( Mp Subramanian swamy )చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలకు సంబంధించిన ఓ వ్యంగ్య ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాముడి జన్మభూమి ఇండియాలో లీటల్ పెట్రోల్ ధర 93 రూపాయలైతే..సీత పుట్టిన నేపాల్‌లో 53 రూపాయలని..రావణుడి శ్రీలంకలో 51 రూపాయలుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. వాస్తవానికి ఈ కంటెంట్ సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటి నుంచి వైరల్ అవుతుండగా..సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌తో మరోసారి వైరల్ అయింది. 


Also read: Delhi Borders: ఢిల్లీ సరిహద్దులు దాటడం ఇక కష్టమే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook