Nitish Kumar Key Comments on Lok Sabha Elections 2024: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ 50 సీట్లకు పడిపోతుందని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. మిగతా పార్టీల నేతలతోనూ ఫోన్ ద్వారా తాను రెగ్యులర్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటై పోటీ చేస్తే బీజేపీ సంఖ్యా బలం 50కి పడిపోవడం ఖాయమన్నారు. పాట్నాలో జరిగిన జేడీయూ జాతీయ కార్య నిర్వాహక కమిటీ సమావేశంలో నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేడీయూ తాజా సమావేశంలో రెండు తీర్మానాలను ఆమోదించారు. ఒకటి.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టేందుకు నితీశ్ పెద్దన్న పాత్ర పోషించడం. రెండు.. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ. నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనకు ముందు జరిగిన ఈ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న నితీశ్ కుమార్.. అందుకు పార్టీ ఆమోదం పొందేందుకే తాజా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


ఇక సోమవారం నుంచి మొదలయ్యే 3 రోజుల తన ఢిల్లీ పర్యటనలో ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తానని నితీశ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు క్యాంపెయిన్ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. దేశంలో బీజేపీ మత విద్వేష రాజకీయాలు చేస్తోందని నితీశ్ ఫైర్ అయ్యారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పుడిక తాను రంగంలోకి దిగబోతున్నానని అన్నారు. ఒక పనికి తాను కట్టుబడి ఉన్నానంటే కచ్చితంగా దాన్ని విజయవంతం చేస్తాననే విషయం ప్రజలకు కూడా తెలుసన్నారు.


నితీశ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలతో కేంద్రంలో బీజేపీతో తలపడేందుకు ప్రత్యామ్నాయ కూటమి పురుడు పోసుకోనుందనే విషయం తేటతెల్లమైంది. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా.. కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమారే ఉంటారా.. ప్రధాని అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా.. వీటన్నింటికీ రానున్న రోజుల్లో సమాధానం దొరకవచ్చు.  


Also Read: కేసీఆర్ టైగర్ అంటూ బండ్ల కామెంట్స్.. ఆడుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్


Also Read: Horoscope Today September 4th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు తమ ప్రియమైన వ్యక్తులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చే ఛాన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook