JP Nadda tests positive for Coronavirus: జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్
JP Nadda tests positive for Coronavirus: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో తాను కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా రిపోర్టులో తనకు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు.
JP Nadda tests positive for Coronavirus: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో తాను కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా రిపోర్టులో తనకు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్లు జేపీ నడ్డా ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.
Also Read: West Bengal: బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఇటీవల రెండు రోజుల బెంగాల్ పర్యటనకు వెళ్లగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేపీ నడ్డా కాన్వాయ్‌పై గురువారం గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడి చేయడం తెలిసిందే. దీనిపై కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్ డీజీపీ సహా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలో లక్షణాలు కనిపించడంతో కోవిడ్ 19 నిర్దారణ పరీక్షలు చేయించుకోగా జేపీ నడ్డాకు కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్‌గా తేలింది.
Also Read: Telangana Jobs 2020: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe