BJP Rajya Sabha Candidates: రాజ్యసభ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 8 రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా వెల్లడించింది. వీరిలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక నుంచి మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆరుగురికి అవకాశం కల్పించగా ఇందులో ఇద్దరు మహిళా అభ్యర్థులు ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి ఇద్దరు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హర్యానాల నుంచి ఒక్కరు చొప్పున బీజేపీ అవకాశం కల్పించింది. ఉత్తరప్రదేశ్ నుంచి అవకాశం దక్కినవారిలో లక్ష్మీకాంత్ వాజ్‌పెయ్, రాధామోహన్ అగర్వాల్, బాబురాం నిషద్, సురేంద్ర సింగ్, దర్శన సింగ్, సంగీత యాదవ్ ఉన్నారు. హర్యానా నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ గౌతమ్‌కు బదులు ఎమ్మెల్యే కిషన్ లాల్ పన్వర్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి కవితా పటిదార్, రాజస్తాన్ నుంచి ఘనశ్యామ్ తివారీ, ఉత్తరాఖండ్ నుంచి కల్పనా సైనీలకు అవకాశం ఇచ్చింది. బీహార్ నుంచి సతీశ్ చంద్ర దూబే, శంభు శరణ్ పటేల్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, అనిల్ సుఖ్‌దేవ్ రావ్, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, జగ్గేష్‌లకు అవకాశం కల్పించింది. 


బీజేపీ తాజా జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఉత్తరాది నుంచి తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ తొలి జాబితాలో ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. తెలంగాణ నుంచి డా.లక్ష్మణ్, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు.. ఏపీ నుంచి టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, పురందేశ్వరిల పేర్లు బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. 



Also Read: June 2022 Horoscope: జూన్ నెల రాశి ఫలాలు... ఆ తేదీ తర్వాత ఈ రాశుల వారి జీవితంలో కీలక మార్పులు


Also Read: IPL 2022 Final GT vs RR Live Updates: రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. నిరాశపరిచిన సంజూ శాంసన్!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి