Temple for PM Modi: పూణె: ప్రధాని నరేంద్ర మోదీకి ఆలయం వెలిసింది. ప్రధాని మోదీ అంటే ప్రాణంగా భావించే బీజేపి కార్యకర్తలనే ఇప్పటివరకు చూశాం. కానీ తాజాగా ఓ కార్యకర్త ఏకంగా ప్రధాని మోదీకి గుడి కట్టించి అందులో మోదీ విగ్రహానికి పూజలు ప్రారంభించాడు. పూణెకి చెందిన 37 ఏళ్ల మయుర్ ముండెకు ప్రధాని మోదీ అంటే అమితమైన ఇష్టం, గౌరవం. అందుకు కారణం మోదీ ప్రధానిగా బాద్యతలు చేపట్టాక దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు (Article 370) చేయడం, త్రిపుల్ తలాక్ విజయవంతంగా అమలు చేయడంతో పాటు ఏళ్ల తరబడి వివాదాస్పద అంశంగా సుప్రీం కోర్టులో నలుగుతున్న అయోధ్య రామ మందిరం వివాదానికి మోదీ సర్కార్ తెరదించి చివరకు అయోధ్యలో రామ మందిర్ (Ayodhya Ram mandir) నిర్మాణం చేపట్టడమే అని చెబుతున్నాడు మయుర్ ముండే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూణెలోని ఔంద్ ఏరియాలో రోడ్డు పక్కనే ప్రధాని మోదీకి కట్టించిన ఈ ఆలయం ఉంది. మయుర్ ముండె లక్షన్నరకుపైగా ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు శ్రమించి ఈ గుడి కట్టించాడు. అయోధ్యలో రామ మందిరం (Ram Mandir in Ayodhya) నిర్మించేందుకు చొరవ తీసుకున్న ప్రధాని మోదీకి కూడా ఓ గుడి ఉండాలని అనిపించింది. అందుకే ఆయనకు గుడి కట్టించే బాధ్యతను తానే తీసుకున్నా అని మయుర్ తెలిపాడు. 



Also read : SC judges appointments: సుప్రీం కోర్టు జడ్జిల నియామకంపై మీడియాలో వార్తలపై CJI ఫైర్


వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన మయుర్ ముండే ప్రధాని మోదీ గుడి కోసం జైపూర్ నుంచి ప్రత్యేకంగా రెడ్ మార్బుల్ తెప్పించాడు. మోదీ విగ్రహానికి (PM Modi bust) భద్రతగా పటిష్టమైన గాజు అద్దాలు బిగించాడు. ప్రధాని మోదీ కోసం రాసిన ఓ పద్యం ఆ పక్కనే కనిపించేలా ఏర్పాటు చేశాడు. 


ఇదిలావుంటే, ప్రధాని మోదీకి ఆలయం (Temple for PM Modi) నిర్మాణాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఓవైపు అభివృద్ధి పథకాలలో మాజీ ప్రధానుల పేర్లు తొలగిస్తూ పోతూనే మరోవైపు సొంత డబ్బా కొట్టుకుంటూ ఈ పనులు చేయడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిథి అనంత్ గాడ్గిల్ మండిపడ్డారు. నేతల పట్ల అభిమానం, స్వామి భక్తి ఉండటంలో తప్పు లేదు కానీ తమ పూణెలో ఇలా మందిరం (PM Modi) నిర్మించి మరీ కొలుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రశాంత్ జగ్పత్ విరుచుకుపడ్డారు.


Also read : Sunanda Pushkar Case: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook