రైతులకు శుభవార్త....పీఎం-కిసాన్ నిధులు విడుదల..చెక్ చేసుకోండి ఇలా!

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 9వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2021, 04:22 PM IST
  • పీఎం-కిసాన్ 9వ విడత నిధులు విడుదల
  • దేశవ్యాప్తంగా 9.75కోట్ల మంది రైతులకు లబ్ధి
  • రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు
రైతులకు శుభవార్త....పీఎం-కిసాన్ నిధులు విడుదల..చెక్ చేసుకోండి ఇలా!

PM-Kisan: రైతన్నలకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 9వ విడత నిధులు విడుదల చేసింది.

పీఎం కీసాన్​ సమ్మాన్​ నిధి(PM Kisan Samman Nidhi ) ద్వారా దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతుల(Farmers) ఖాతాల్లోకి రూ.19,509 కోట్లు జమకానున్నాయి. ఈ విడతలో ప్రతి రైతు బ్యాంకు ఖాతాలోకి రూ.2000 వేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ (PM Modi) లబ్ధిదారులతో సంభాషించనున్నారు.

 

పీఎం-కిసాన్(PM-KISAN)అంటే..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు   రూ. 6000/- ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. అంటే నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతుల(Farmers)కు అందిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. ఈ పథకంలో, ఇప్పటివరకూ 1.38 లక్షల కోట్లు రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.

Also Read:80 కోట్ల మంది భారతీయులకు ఫ్రీ రేషన్ పంపిణీ: పీఎంజికెఏవై లబ్ధిదారులతో ప్రధాని మోదీ

ఇలా చెక్ చేసుకోండి..

పీఎం కిసాన్(PM-KISAN) లబ్ధిదారుడు తన ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలంటే ..ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తరువాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి. అలా ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘'డేటాను పొందండి'’పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా ఇక్కడ కనిపించే ‘'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయొచ్చు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News