Sunanda Pushkar Case: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట..

Shashi Tharoor: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట లభించింది. ఆయనపై పేర్కొన్న అభియోగాలను దిల్లీలోని సెషన్స్‌ కోర్టు కొట్టేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2021, 02:33 PM IST
  • సునంద పుష్కర్ మృతి కేసులో ఎంపీ శశి థరూర్‌కు ఊరట
  • ఎంపీపై అభియోగాలను కొట్టేసిన దిల్లీ సెషన్స్ కోర్టు
  • అదనపు పత్రాలు సమర్పించేందుకు దిల్లీ పోలీసులకు అనుమతి
Sunanda Pushkar Case: సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఊరట..

Sunanda Pushkar Case: తన భార్య సునందా పుష్కర్‌ మృతి కేసులో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను దిల్లీలోని సెషన్స్‌ కోర్టు బుధవారం కొట్టివేసింది. 

2014, జనవరి 17న దిల్లీ(Delhi)లోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా పుష్కర్‌(Sunanda Pushkar)  అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టించింది. తొలుత ఇది హత్య అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిగింది. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌ ఫైల్  చేశారు. అయితే, సునంద ఆత్మహత్య(Suicide) చేసుకునేలా థరూర్‌(Shashi Tharoor) ప్రేరేపించారని ఆయనపై అభియోగాలు నమోదు చేసి ప్రధాన నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. దీనిపై ఆయన దిల్లీ కోర్టు(Delhi Court)ను ఆశ్రయించారు.

Also Read: Central government: న్యాయమూర్తులకు ఆ తరహా రక్షణ సాధ్యం కాదు

ఈ కేసుపై విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు.. నేడు థరూర్‌పైన నమోదైన అభియోగాలను కొట్టివేసింది. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన అదనపు పత్రాలను సమర్పించేందుకు దిల్లీ పోలీసుల(Delhi Police)కు అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానానికి  శశిథరూర్‌(Shashi Tharoor)  కృతజ్ఞతలు తెలిపారు. ‘‘గత ఏడున్నరేళ్లుగా ఎన్నో వేధింపులకు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు వాటి నుంచి ఉపశమనం లభించింది’’ అని ఆయన పేర్కొన్నారు.

సునంద్, శశిథరూర్‌లు 2014లో వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆమె మృతిచెందడంపై అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. పాకిస్థాన్ జర్నలిస్ట్ తో శశిథరూర్‌కు అక్రమ సంబంధం ఉందని సునంద్ చివరిగా చేసిన ట్వీట్ మరింత అనుమానాలకు దారితీసింది. తొలుత ఆమెకు విషమిచ్చి చంపారని పోలీసులు ఆరోపించారు. చనిపోయే నాటికి  సునంద పుష్కర్(Sunanda Pushkar)  పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని శశిథరూర్ తరఫున న్యాయవాది వికాస్ పహ్లవ్ వాదించారు. ఆమెను వేధింపులకు గురిచేసినట్టు, క్రూరంగా హింసించారనడానికి ఎటువంటి ఆధారల్లేవని స్పష్టం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News