Hyderabad Rains: హైదరాబాద్ చేరుకున్న 40 బోట్లు
Hyderabad Floods | గత పదిరోజులుగా హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Boats from AP | గత పదిరోజులుగా హైదరాబాద్ ( Hyderabad) నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మరో మూడురోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) ముందస్తుగా సిద్ధం అవుతోంది.
విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరం అయ్యే బోట్లు నగరానికి చేరుకుంటున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టూరిజంకు చెంది పలు ప్రాంతాల నుంచి సుమారు 40 బోట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. ప్రస్తుతం నగరంలో వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సరిపడా బోట్లు లేవు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ముందు ప్రస్తావించగా యుద్ధప్రాతిపదికగా తగిన ఏర్పాట్లు చేయమని తెలిపారు.
దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ( CM Jagan ) మాట్లాడిన సీఎం కేసీఆర్ బోట్లు అందించాల్సిందిగా కోరారు. దీనికి సీఎం జగన్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR