Bollywood Drugs Case: హాస్యనటి భర్త సైతం అరెస్ట్
డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో హాస్యనటి భారతీ సింగ్ (Bharti Singh ) ను నిన్న సాయంత్రం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను సైతం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు.
Bharti Singh's husband Haarsh Limbachiyaa arrested by NCB: ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య నాటినుంచి.. డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ (Bollywood Drugs Case) ను కుదిపేస్తున్నది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో హాస్యనటి భారతీ సింగ్ (Bharti Singh ) ను నిన్న సాయంత్రం ఎన్సీబీ (NCB) అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను సైతం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. శనివారం భారతీ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా 86.5 గ్రాముల గంజాయి లభించడంతోపాటు.. దంపతులిద్దరూ గంజాయ్ అలావాటుందని అధికారులకు వెల్లడించారు. అయితే ముందుగా భారతీని అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఆమె భర్తను 15 గంటలపాటు విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే వెల్లడించారు. Also read: Bollywood Drugs Case: హాస్యనటి భారతీ సింగ్ అరెస్ట్
బాలీవుడ్లో ముందుగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టు నాటినుంచి డ్రగ్స్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది ఎన్సీబీ. ఆ తర్వాత బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖలను కూడా విచారింది. ఈ నెల ప్రారంభంలో యాక్టర్ అర్జున్ రాంపాల్, ప్రొడ్యూసర్ ఫిరోజ్ నదియావాలా ఇళ్లలోనూ కూడా సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసు బుల్లితెరనూ కూడా తాకింది. ప్రముఖ బుల్లితెర కమెడియన్ భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను అధికారులు అరెస్టు చేయడంతో బాలీవుడ్లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. Also read: Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం
Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి