Bollywood Drugs Case: హాస్యనటి భారతీ సింగ్ అరెస్ట్

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మ‌హ‌త్య నాటినుంచి బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం (Bollywood Drugs Case) బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా ద‌ర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ డ్రగ్స్‌ కేసు బాలీవుడ్ బుల్లితెరనూ కూడా తాకింది

Last Updated : Nov 22, 2020, 07:28 AM IST
Bollywood Drugs Case: హాస్యనటి భారతీ సింగ్ అరెస్ట్

TV actress Bharti Singh arrested by NCB: ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మ‌హ‌త్య నాటినుంచి బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం (Bollywood Drugs Case) బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా ద‌ర్యాప్తు చేస్తోంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖలను ఎన్‌సీబీ అంతకుముందు విచారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డ్రగ్స్‌ కేసు బుల్లితెరనూ కూడా తాకింది. ప్రముఖ బుల్లితెర కమెడియన్‌ భారతీ సింగ్‌ (Bharti Singh) ను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. దీంతోపాటు ఆమె భర్త, బుల్లితెర నిర్మాత అయిన హర్ష్‌ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఓ డ్రగ్‌ సరఫరాదారుడి విచారణ సందర్భంగా వీరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఎన్‌సీబీ అధికారులు శనివారం ముంబైలోని భారతీ ఇంట్లో సోదాలు నిర్వహించగా 86.5 గ్రాముల గంజాయి లభించిందని ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే తెలిపారు. ఈ మేరకు భారతీ సింగ్‌ను అరెస్టు చేసి ఆమె భర్త హర్ష్‌ లింబాచియాను కూడా ప్రశ్నిస్తున్నారు. ల్యాబ్‌ ఫలితాలు వచ్చాక భారతీ భర్తను కూడా అరెస్టు చేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే గంజాయ్ అలవాటుందని వారిద్దరూ అంగీకరించారని తెలిపారు. భారతీ సింగ్‌ పలు హిందీ టీవీ రియాల్టీ షోలల్లో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. దీంతోపాటు ముంబైలోని మరికొన్ని చోట్ల ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను అధికారులు ప్రశ్నించడానికి పిలిచిన విషయం తెలిసిందే. Also read: Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం

Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News