Booster Dose: దేశంలోని కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. నిపుణుల సూచనలకు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ మొదటి, రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోసు అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే ప్రస్తుతం దేశంలో కరోనా డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది. ఫోర్త్ వేవ్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. బూస్టర్ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్(NTAGI) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 



Also read:ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ షో..నిరాశ పర్చిన విరాట్ కోహ్లీ..! 


Also read:Mukhtar Abbas Naqvi: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నఖ్వీ..?నుపుర్ శర్మ వ్యవహారం నుంచి బయటపడేందుకేనా..?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook