Corona cases in India: నిన్నటి కంటే భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే?

Covid 19 Updates: దేశంలో కొవిడ్ వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. దేశంలో నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 13 వేల 086 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 24 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 223కి పెరిగింది.

Written by - Srisailam | Last Updated : Jul 5, 2022, 10:35 AM IST
  • నిన్నటితో తగ్గిన కొవిడ్ కేసులు
  • గత 24 గంటల్లో 13, 086 కేసులు
  • లక్షా 13 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Corona cases in India: నిన్నటి కంటే భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే?

Covid 19 Updates: దేశంలో కొవిడ్ వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. దేశంలో నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 13 వేల 086 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 24 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 223కి పెరిగింది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కేసుల సంఖ్య తగ్గడానికి టెస్టుల సంఖ్య తగ్గడమే కారణమని తెలుస్తోంది.

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తమిళనాడులో కల్లోలం రేపుతోంది. చెన్నైలో 2 వేలకు పైగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  13 వేల 958 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా  పదమూడు వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.26 శాతానికి పెరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే చాలా మందకొడిగా సాగుతోంది. దేశంలో నిన్న మరో లక్షా 78 వేల 383 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 197 కోట్ల 98 లక్షల 21 వేల 197 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 

Read also: Rains in Telangana: తెలంగాణలోని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు...  

Read also: US Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. చికాగో కాల్పుల్లో ఆరుగురు మృతి, 24 మందికి గాయాలు... 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News