#BoycottAmazon trends on Twitter: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌పై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న రాధా-కృష్ణుల అభ్యంతరకర పెయింటింగ్‌ను విక్రయానికి పెట్టడంపై మండిపడుతున్నారు. #BoycottAmazon హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన హిందూ జన జాగృతి సమితి అమెజాన్‌పై సుబ్రహ్మణ్య నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరుకు చెందిన Inkologie అనే సంస్థ శ్రీకృష్ణ జన్మాష్ఠమి సందర్బంగా అమెజాన్‌లో ఈ చిత్రాన్ని అమ్మకానికి పెట్టింది.  రాధా, కృష్ణుడు అడవిలో ఏకాంతంగా గడుపుతున్నట్లుగా ఆ పెయింటింగ్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. దీనిపై 43 శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించారు. అయితే ఈ పెయింటింగ్‌లో అశ్లీలత ఉండటం హిందూ సంఘాలకు, నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.


బాయ్‌కాట్ అమెజాన్ హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడంతో.. తమ సైట్‌ నుంచి అమెజాన్ ఆ పెయింటింగ్‌ను తొలగించింది. ఇదే పెయింటింగ్ ఎగ్జోటిక్ ఇండియా అనే మరో సైట్‌లోనూ విక్రయానికి ఉండగా.. హిందూ సంఘాల ఆగ్రహంతో ఆ సంస్థ కూడా పెయింటింగ్‌ను తొలగించింది. హిందువులకు క్షమాపణలు కూడా చెప్పింది. అమెజాన్ ఆ పెయింటింగ్‌ను తొలగించింది కానీ వివాదంపై స్పందించలేదు. అమెజాన్ మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని.. చేసినట్లయితే ఇక ఇండియాలో కస్టమర్సే ఉండరని నెటిజన్లు ఆ సంస్థను హెచ్చరిస్తున్నారు. 



 



Also Read: KCR Munugode Meeting Live Updates: కాసేపట్లో మునుగోడు బహిరంగసభకు సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ కు సీపీఐ సపోర్ట్    


Also Read: UP New Jail Manual: ఇకపై జైళ్లలో మహిళా ఖైదీలు మంగళసూత్రం ధరించవచ్చు.. పండగలు జరుపుకోవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook