IQOO 9T 5G: సగం కన్నా తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ అద్భుత ఆఫర్..

Amazon IQOO 9T 5G Smartphone:  ఏదైనా మంచి ఆఫర్ దొరికితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకోసం అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 16, 2022, 03:38 PM IST
  • అమెజాన్ లేటెస్ట్ ఆఫర్స్
  • స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు
  • ఐక్యూ బ్రాండ్‌పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్
IQOO 9T 5G: సగం కన్నా తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. అమెజాన్ అద్భుత ఆఫర్..

Amazon IQOO 9T 5G Smartphone: ఏదైనా మంచి ఆఫర్ దొరికితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకోసం అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లు చౌక ధరకే అమెజాన్‌లో లభిస్తున్నాయి. వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ స్మార్ట్ ఫోన్లపై ప్రస్తుతం అమెజాన్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. రూ.55 వేలు విలువ చేసే iQ00 9T 5G స్మార్ట్ ఫోన్‌ని అమెజాన్ సగం కన్నా తక్కువ ధరకే అందిస్తోంది.

అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీగా ఆదా చేసుకోవచ్చు :

 iQ00 9T 5G (లెజెండ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌ అసలు ధర  రూ.54,999. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 9 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. తద్వారా రూ.49,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ మీకు లభిస్తుంది. అలా, రూ.5 వేలు వరకు ఆదా అయినట్లే. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు కొటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా కేవలం రూ.48,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో సగం కన్నా తక్కువ ధరకే :

మీ పాత హ్యాండ్ సెట్‌ను ఇచ్చి ఎక్స్‌చేంజ్ ఆఫర్ పొందినట్లయితే గరిష్ఠంగా రూ.24,450 వరకు తగ్గింపు పొందగలరు. హ్యాండ్ సెట్ కండిషన్ బాగున్నట్లయితే పూర్తి ఆఫర్ పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ గనుక వర్తించినట్లయితే రూ.49,999కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ని కేవలం రూ.25,549కే సొంతం చేసుకోవచ్చు. కొటాక్ క్రెడిట్ కార్డు ఉపయోగించడం ద్వారా మరో రూ.1500 తగ్గింపు పొందినట్లయితే ధర రూ.24,049కి తగ్గుతుంది.

iQ00 9T 5G ఫీచర్స్ :

సెల్యూలర్ టెక్నాలజీ :5జీ
స్క్రీన్ సైజ్ : 6.78 అంగుళాలు 
కనెక్టివిటీ టెక్నాలజీస్ : యూఎస్‌బీ టైప్ సీ, వైఫై 6, బ్లూటూత్ 5.2
బ్యాటరీ : 4700mAh 

Also Read: Chinese Spy Ship: చైనా నౌక నిఘాలో భారత్ అణుకేంద్రాలు! హంబన్‌టొటలో యువాన్‌ వాంగ్.. మనకు గండమేనా?  

Also Read: ఒకేసారి 7 లక్షల మంది దండయాత్ర.. వెబ్‌సైట్ క్రాష్! హాట్‌కేకుల్లా అమ్ముడైన భారత్‌-పాక్‌ మ్యాచ్ టికెట్లు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News