BSNL Recruitment 2022: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ 'లీగల్ ప్రొఫెషనల్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను మొదట ఏడాది కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. అభ్యర్థి పనితీరు, కంపెనీ అవసరాలను బట్టి కాంట్రాక్టును మరో రెండేళ్లకు పొడగించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.75 వేలు నెల వారి వేతనం అందజేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు :


అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ లా యూనివర్సిటీల నుంచి ఐదేళ్ల ఎల్ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి.


ఎంపికైన అభ్యర్థులు నిర్వర్తించాల్సిన విధులు :


ఎంపికైన అభ్యర్థులు సర్వీస్ మ్యాటర్స్, కాంట్రాక్టులు, టాక్సేషన్, కంపెనీ లా, NCLT, అద్దె వివాదాలు వంటి అంశాలను డీల్ చేయాల్సి ఉంటుంది. కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో బీఎస్ఎన్ఎల్ లీగల్ వ్యవహారాలను వాదించాల్సి ఉంటుంది. చట్టపరమైన వివాదాలను విశ్లేషించి తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఇలా అప్లై చేసుకోవాలి :


ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 9, 2022 లోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.bsnl.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Also Read: Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook