Mumbai Fire Accident Live Updates: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..

Mumbai Fire News Live Updates: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టార్డియో ప్రాంతంలోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కమలా బిల్డింగ్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 04:53 PM IST
  • ముంబై టార్డియోలో భారీ అగ్ని ప్రమాదం
  • కమలా బిల్డింగ్‌లో ఉవ్వెత్తున మంటలు
  • ఆరుగురు మృతి, 27 మందికి గాయాలు
Mumbai Fire Accident Live Updates: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి..

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టార్డియో ప్రాంతంలోని గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కమలా బిల్డింగ్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. 20 అంతస్తుల ఈ భవనంలో 18వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. శనివారం (జనవరి 22) ఉదయం 7.30 గం. సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 13 ఫైరింజన్లు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

అగ్ని ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు బృహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు వెల్లడించారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. 'అపార్ట్‌మెంట్ 18వ అంతస్తులోని 1904 ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ మొత్తం పొగతో కమ్ముకుపోయింది. ఆ బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉన్నప్పటికీ.. అది పనిచేయట్లేదు. ప్రమాదంలో బిల్డింగ్‌లోని ఎలక్ట్రిక్ కేబుల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి.' అని తెలిపారు.

ప్రమాద సమయంలో కమలా బిల్డింగ్‌లోని చాలామంది నిద్రలో ఉన్నారని బీఎంసీ సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంటలు (Fire Accident) అదుపులోకి వచ్చాయని.. పొగ ఇప్పటికీ దట్టంగా వ్యాపించి ఉందని చెప్పారు. పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆరుగురు వృద్దులకు ఆక్సిజన్ సపోర్ట్ అందించామని.. వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. బిల్డింగ్‌లోని మిగతావారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఆదిత్య థాక్రే సందర్శించే అవకాశం ఉంది.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా :

అగ్నిప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారికి రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.

Also Read: Akhanda Roar On Hotstar: బాలయ్య బాబునా మజాకా.. థియేటర్లలోనే కాదు ఇళ్లల్లో కూడా మాస్ జాతరే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News