హైదరాబాద్: దేశంలో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో 5జీని మేమే ప్రారంభిస్తామని ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ప్రపంచంలో 5జీ సేవలు ఎప్పుడు మొదలవుతాయో.. దాదాపు అదే సమయంలో దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్ జైన్ తెలిపారు. దేశంలో అన్ని సంస్థల కంటే ముందుగా తామే 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గతంలో 4జీ సేవల అవకాశాన్ని కోల్పోవడంతో మరో ఛాన్స్ వదలకుండా పనిచేస్తున్నామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు జూన్ 2020 నాటికి ప్రారంభ కావచ్చునన్న అంచనాలున్నాయనీ.... అయితే 2019 నాటికే ప్రారంభమయ్యే వీలుందన్నారు. ఇదే జరిగితే వద్దే ఏడాదే దేశంలో 5జీ సేవలను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొస్తుందని పేర్కొన్నారు.  కొత్త ఆఫర్లతో ల్యాండ్ లైన్ నుంచి 15 లక్షలు, బ్రాండ్ బ్యాండ్ నుంచి 30 లక్షల కొత్త కస్టమర్లను ఈ ఏడాది పొందాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. 5జీ సేవలను పరిశీలించేందుకు నోకియా, ఎన్ టీటీ అడ్వాన్స్ టెక్నాలజీ సహా పలు అంతర్జాతీయ ఆపరేటర్లతో ఒప్పందాలపై సంతకం చేసినట్లు తెలిపారు.


తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నాలుగా కొత్త నాన్‌-ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ప్రకటించింది. బీబీజీ యూఎల్డీ ప్లాన్‌లో భాగంగా 99, 199, 299, 491 రూపాయల ప్లాన్‌ లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చని అనిల్ జైన్ తెలిపారు.