Changes in Budget Traditions: కేంద్ర బడ్జెట్‌-2022కి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికీ దేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉండబోతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక బడ్జెట్ సాంప్రదాయాల విషయానికొస్తే.. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"221050","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈసారి హల్వా వేడుక లేదు.. : ప్రతీ ఏటా బడ్జెట్ ప్రతుల ముద్రణకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో 'హల్వా వేడుక'ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి హల్వా వేడుకకు బదులు స్వీట్లు పంచనున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈసారి హల్వా వేడుకను నిర్వహించట్లేదని కేంద్రం వెల్లడించింది.[[{"fid":"221062","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]][[{"fid":"221052","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలో మార్పు : బ్రిటీష్ ఇండియా కాలం నుంచి 2016 వరకు భారత్‌లో ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగేది. కానీ 2017 నుంచి కేంద్రంలోని మోదీ సర్కార్ ఆ తేదీని ఫిబ్రవరి 1కి మార్చేసింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రక్రియను ఏప్రిల్ 1 లోగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ముందుకు జరిపింది.[[{"fid":"221063","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"10"}}]]


కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ విలీనం : గతంలో కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ వేర్వేరుగా ప్రవేశపెట్టేవారు. కానీ మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2016లో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేశారు. అప్పటినుంచి ప్రతీ ఏటా కేంద్ర బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెడుతున్నారు.[[{"fid":"221064","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"11":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"11"}}]]


[[{"fid":"221057","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]సూట్‌కేసుకు బదులు ఎర్రసంచి, ట్యాబ్లెట్ : గతంలో ఆర్థిక మంత్రులు బడ్జెట్ రోజున చేతిలో సూట్ కేసుతో పార్లమెంటుకు వచ్చేవారు. కానీ తొలిసారి ఫిబ్రవరి 1, 2021న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత సాంప్రదాయాలకు భిన్నంగా చేతిలో ట్యాబ్లెట్ పట్టుకుని వచ్చారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్ కాపీలకు బదులు ఆమె ట్యాబ్లెట్‌తో వచ్చారు. అంతకుముందు, 2019లో సూట్‌ కేసుకు బదులు ఎర్రటి సంచిలో బడ్జెట్ కాపీలను తీసుకొచ్చారు.[[{"fid":"221065","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"12":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"12"}}]]


ప్లానింగ్ కమిషన్‌కు బదులు నీతి ఆయోగ్ : 2015లో మోదీ (Narendra Modi) సర్కార్ ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి.. దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చింది. దీంతో పంచవర్ష ప్రణాళికలకు ముగింపు పలికినట్లయింది. స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. 2012-2017 పీరియడ్‌తో పంచవర్ష ప్రణాళికలకు బ్రేక్ పడింది.


Also Read: Telangana Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల రీఓపెనింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook