Telangana Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. అన్ని విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలు వెల్లడించారు.
నిజానికి మరో వారం పాటు విద్యా సంస్థలకు సెలవులు పొడగించవచ్చుననే ప్రచారం జరిగినప్పటికీ... ప్రభుత్వం విద్యా సంస్థలను తెరిచేందుకే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఈ నెల 30తో సెలవులు ముగుస్తుండటం... స్కూళ్ల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో... విద్యా సంస్థల పున:ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మొదట ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు వారాలకు సెలవులను పొడగించింది. కరోనా కేసుల సంఖ్య (Covid 19 Cases) పెరగడంతో సెలవులను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గుతుండటంతో విద్యా సంస్థలను రీఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థల రీఓపెనింగ్‌కి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Hyderabad Sex racket: హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్- గెస్ట్ హౌస్‌లో దందా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook