Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్లుగా సుఖ్‌బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్ లు..
Central Election Commession: భారత ఎన్నికల సంఘం టాప్ ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలు భర్తీ అయ్యాయి. బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ మధ్యాహ్నం మీడియాకు తెలిపారు.
Sukhbir Sandhu and Gyanesh Kumar Appointed as new Election Commissioners: కేంద్ర ఎన్నికల సంఘంకు ఇద్దరు కొత్తగా బ్యూరోక్రాట్లను ఎంపిక చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనల్ రాజీవ్ కుమార్ ఎన్నికలపై కసరత్తును ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనకు సహాయంగా మరో ఇద్దరు బ్యూరోక్రాట్లను కమిషనర్లుగా నియమించినట్లు తెలుస్తోంది. వీరిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్యానల్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్‌లో చౌదరి కూడా ఉన్నారు. ఈ సమావేశానికి ప్రధాని, చౌదరితో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Read More: Pratibha Patil: ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్.. అసలేం జరిగిందంటే..?
కేరళ నుంచి జ్ఞానేష్‌కుమార్, పంజాబ్ నుంచి సుఖ్‌బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్‌లుగా ఎంపికయ్యారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇదిలా ఉండగా.. సెలక్షన్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించే చట్టంపై కాంగ్రెస్ నాయకుడు కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read More: Delhi Hit And Run Case: తప్పతాగి హల్ చల్ చేసిన టాక్సి డ్రైవర్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో ఇదే..
నిజానికీ ఈ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాల్సిందని అన్నారు. గతేడాది తీసుకొచ్చిన చట్టం ఈ సమావేశాన్ని కేవలం లాంఛనంగా కుదించిందన్నారు. ప్రస్తుతం ప్యానల్ లో.. కేంద్ర పెద్దలు మెజారీటిగా ఉన్నారని, వాళ్లు కోరుకుందే జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా.. నిన్న రాత్రి పరిశీలన కోసం తనకు 212 పేర్లను ఇచ్చారని, ఈరోజు ఇద్దరిని కమిషర్లుగా ప్రకటించేశారని అన్నారు. ఇంత తొందరగా వందల మంది అభ్యర్థులను ఎలా వడబోసారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter