Delhi Hit And Run Case: తప్పతాగి హల్ చల్ చేసిన టాక్సి డ్రైవర్‌.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో ఇదే..

Drunk And Drive: ఢిల్లీలోని ఘాజీపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక టాక్సీ డ్రైవర్ తప్పతాగి ఢిల్లీ మార్కెట్ లో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో రోడ్డుపైన వెళ్తున్న అమాయకులు గాయపడినట్లు తెలుస్తోంది. ఒక మహిళ.. ఈ ఘటనలో చనిపోయినట్లు పోలీసులు సమాచారం. వెంటనే బాధితులను లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 14, 2024, 10:53 AM IST
  • ఢిల్లీలో ఘాజిపూర్ లో రోడ్డు ప్రమాదం..
  • తప్పతాగి రాష్ డ్రైవింగ్..
Delhi Hit And Run Case: తప్పతాగి హల్ చల్ చేసిన టాక్సి డ్రైవర్‌.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో ఇదే..

Delhi Drunk Taxi Driver Road Accident: కొందరు రోడ్లపైన తప్పతాగి వాహనాలు నడిపిస్తుంటారు. ఇష్టమున్నట్లు అడ్డదిడ్డంగా వాహనాలు నడిపిస్తూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటారు. తాగి వాహనాలు నడిపిస్తు యాక్సిడెంట్ చేసిన ఘటనలు తరచుగా వార్తలలో వస్తుంటాయి. మరికొందరు రాంగ్ రూంట్ లలో, రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమౌతుంటారు. చిన్న చిన్న గల్లీలలో కూడా ఇటీవల రాష్‌ డ్రైవింగ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి . ట్రాఫిక్ పోలీసులు, టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు ఎలాంటి రూల్స్ పాటించాలని తరచుగా అవగాహన కల్పిస్తుంటారు.. అయిన కూడా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.

 

 

ఫెస్టివల్స్ రోజుల్లో, కొందరు వీకెండ్ లలో పార్టీల పేరుతో, కార్ల స్పీడ్ కాంపిటేషన్ పెట్టుకుని రాష్‌ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలలో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు డ్రైవర్లు ఫుల్ గా తాగుతుంటారు. ఇలాంటి వారు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. మరికొందరు వాహనాలు నడపడం రాకున్న కూడా కార్లుతో రోడ్డుపైకి వస్తుంటారు. ఇలాంటి వారికి వెహికిల్ కంట్రోల్ కాక ప్రమాదాలు చేస్తుంటారు. వీరి ప్రాణాలు రిస్క్ లో పడటమేకాకుండా.. అమాయకుల ప్రాణాలు కూడా బలితీసుకుంటారు. అచ్చం ఇలాంటి ఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు..

తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన సంభవించింది. ఒక కారు రద్దీగా ఉండే మార్కెట్‌లో వేగంగా దూసుకొచ్చింది. అంతే కాకుండా.. దాదాపు 15 మందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. వెంటనే స్థానికులు కారు డ్రైవర్ ను పట్టుకున్నారు. అతడు అప్పటికే ఫుల్ గా తాగి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, మృతి చెందిన మహిళను  ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ నివాసి 22 ఏళ్ల సీతా దేవిగా గుర్తించారు. ఘాజీపూర్‌లోని బుద్ బజార్‌లో కారు ఢీకొన్న 15 మందిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ వారందరినీ సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు.

కారు ఢీకొట్టిన బాధితులలో ఒకరైన.. సరిత ఎడమ కన్ను, కాలు దగ్గర ముఖానికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేను నా కుమార్తెతో కలిసి షాపింగ్‌కు వెళుతుండగా.. ఢీకొన్న సమయంలో మార్కెట్‌ జనంతో నిండిపోయింది. కారు నా వెనుక నుంచి వచ్చి నన్ను ఢీకొట్టిందని.. నా కూతురికి వెన్ను, గాయాలు ఉన్నాయని చెప్పారు. టాక్సీ మయూర్ విహార్ ఫేజ్ 3కి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో రాత్రి 9:30 గంటల సమయంలో ఘాజీపూర్‌లోని రద్దీగా ఉండే బుద్ బజార్ ప్రాంతంలోకి తన కారును ఢీకొట్టాడు.

Read More: Pratibha Patil: ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్.. అసలేం జరిగిందంటే..?

రోడ్డుపై అమర్చిన CCTV కెమెరాలో ఈఘటన రికార్డు అయ్యింది.  వాహనం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, ఎడమవైపునకు దూసుకెళ్లి, ఒక మహిళను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు. పోలీసులు అక్కడి వారిని సముదాయించి, కారు డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x