ఈనెల 18న అక్షయ తృతీయ. ఆ రోజున ఎంతో కొంత బంగారం కొంటే శుభం కలిసొస్తుందని భారతీయులు నమ్ముతారు. దీనిని పురస్కరించుకుని పలు సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్లకు ఆకర్షితులై మోసపోకుండా ఉండాలంటే బంగారం కొనే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

* బంగారం నాణ్యతను తప్పక పరిశీలించండి. ప్రతి ఆభరణం మీద తప్పక బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ముద్ర, స్టాంపు, క్యారెట్‌లు, హాల్‌మార్కింగ్‌ సంవత్సరాన్ని కూడా చూడండి.


* మేకింగ్ చార్జీలపై ఇతర దుకాణ ధరలతో సరిపోల్చండి. ఎందుకంటే ఒక్కో దుకాణంలో ఒక్కో రకమైన మేకింగ్‌ చార్జీలు ఉంటాయి. అందుకే ఆభరణం కొనేముందు రెండు, మూడు షాపుల్లో ధరలను వాకబు చేసుకోండి.


* బంగారం తీసుకొనే ముందు మరోసారి బరువు చూసుకోండి. అలానే బిల్లులోని వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి.


* ఎక్కువగా నాణేలు, బిస్కెట్లు రూపంలో కొనండి. బంగారాన్ని పూర్తిగా పెట్టుబడి పెట్టే ఉద్దేశం ఉన్నవారికి ఇదైతేనే ఉత్తమం. కొనేవారిలో ఎక్కువ మంది బంగారాన్ని పెట్టుబడిగానే భావిస్తారు.


* రాళ్లు పొదిగిని ఆభరణాలతో పోల్చితే సాదా ఆభరణాల ధర తక్కువ. పైగా మేకింగ్ కూడా తక్కువే. రాళ్లు పొదిగిన ఆభరణాలను అమ్మాలనుకున్నా, మార్పు చేసుకోవాలన్నా రాళ్ల ఖరీదును తీసేసి  బంగారానికి మాత్రమే లెక్కకడతారు. కాబట్టి రాళ్లు పొదిగిన ఆభరణాలను కొనకపోవడమే ఉత్తమం.


సోమవారం దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర 100 చొప్పున తగ్గి 10 గ్రాములకు రూ.32వేలుగా, రూ.31,850గా, వెండి కిలో రూ.39, 900గా రికార్డయ్యాయి.  కాగా ఈ నెలలలో  పెళ్ళిళ్ళ సీజన్, అక్షయ తృతీయ లాంటివి ఉండటంతో బగారం ధరల్లో మార్పు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. రూ.800 నుంచి రూ. 900దాకా బంగారం ధరలు పెరగవచ్చని వారి అభిప్రాయాలను తెలిపారు.