ఉప ఎన్నికల ఫలితాలపై ఎనలేని ఆసక్తి నెలకొంది. ఎందుకుంటే దానికున్న ప్రాధాన్యత అలాంటిది మరి. సిట్టింగ్ స్థానాల్లో ఒక్క సీటు తగ్గినా బీజేపీ విశ్వాస పరీక్ష ఎదుర్కొనే అవకాశముంది. అదెలాగనుకుంటున్నారా ?. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్నాటక ఎన్నికల నేపథ్యంలోయడ్యూరప్ప, శ్రీరాములు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..దీంతో ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ సంఖ్యా బలం 272కి పడిపోయింది. ఇందులో  ఎంపీ శత్రుఘ్నసిన్హా ఎప్పటి నుంచో తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు . మరొక ఒక ఎంపీ కీర్తి ఆజాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనధికారికంగా బీజేపీ సంఖ్యాబలం 270 చేరినట్లే.. 


వాస్తవానికి లోక్ సభలో కావాల్సిన మెజార్టీ 273. కాబట్టి బీజేపీ సొంతంగా మెజార్టీ నిలుపుకోవాలనుకుంటే ఉప ఎన్నికల్లోని అన్ని స్థానాల్లోనూ గెలుపొందాల్సిన పరిస్థితి. కనీసం  మూడు స్థానాలు గెలుచుకున్నా మ్యాజిక్ ఫిగర్ కు చేరువ అవుతుంది. అది జరగని పక్షంలో విశ్వాస పరీక్షకు వెళ్లాల్సి వస్తే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు.  దీంతో బీజేపీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీసం సిట్టింగ్ స్థానాలైనా గెలుచుకోవడం అవసరంగా మారింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ రెండు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. మిగిలిన రెండు స్థానాల్లో ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ ముందంజలో ఉంది.