జైపూర్/కోలకతా: గురువారం ఉదయం రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాజస్థాన్ లోని అజ్మీర్, ఆల్వార్లోని రెండు లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. బిజేపీ మండల్ఘర్ అసెంబ్లీ స్థానంలో ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో ముందంజలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ లోని రెండు లోక్సభ స్థానాలకు-అజ్మీర్, అల్వార్, ఒక అసెంబ్లీ నియోజకవర్గం - మండల్ఘర్ లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఉలుబేరియా(లోక్సభ), నోయపారా (అసెంబ్లీ) స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరుగుతోంది.


రెండు రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ఓటింగ్ జనవరి 29, 2018లో జరిగింది . రాజస్థాన్ లోని మూడు సీట్లకు 42 మంది అభ్యర్థులు, 13 మంది అభ్యర్థులు పశ్చిమ బెంగాల్ లోని రెండు స్థానాలకు పోటీ చేస్తున్నారు. బిజేపీ ఎంపీలు సంర్లాల్ జత్(అజ్మీర్), మహంత్ చంద్ నాథ్ యోగి(అల్వార్), ఎమ్మెల్యే కీర్తీ కుమారి(మండల్ఘర్) మరణానంతరం ఈ మూడు స్థానాలకు ఉపఎన్నికలు తప్పనిసరయ్యాయి. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ ఎంపీ సుల్తాన్ అహ్మద్(ఉలుబేరియా),కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ ఘోష్ల (నోయపారా)  చనిపోయిన తరువాత ఉప ఎన్నికలు జరిగాయి.


కాగా సోమవారం జరిగిన బైపోల్ లో లుబేరియా లోక్సభ నియోజకవర్గంలో 76 శాతం, నోయపారా అసెంబ్లీలో 75.3 శాతం ఓట్లు పోలయ్యాయి. అజ్మీర్ లో 65.20 శాతం ఓటింగ్ నమోదైంది. ఆల్వార్ లో 61.86, మండల్ఘర్ లో 78.78 శాతం పోలింగ్ నమోదైందని సీనియర్ ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.