84405 CAPF vacancies will be filled by Decenber 2023: కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) ప్రస్తుతం ఉన్న 84,405 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. డిసెంబర్ 2023 నాటికి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బుధవారం పార్లమెంటులో పేరొన్నారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ అనిల్ అగర్వాల్ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు మంత్రి నిత్యానంద రాయ్.. పై విధంగా సమాధానం ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 10,05,779 ఖాళీలు మంజూరయ్యాయని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.  25,271 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (10918), అస్సాం రైఫిల్స్ (9659), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (19254), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (29985), సశస్త్ర సీమా బల్ (11402), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (3187) విభాగాల్లో మొత్తంగా 84405 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. 


సాయుధ దళాలకు మంజూరైన మొత్తం పోస్టుల సంఖ్య 1005779 అని మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు. సీఏపీఎఫ్‌లలో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాప్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కూడా మంత్రి నిత్యానంద రాయ్ చెప్పుకొచ్చారు. 


రిక్రూట్‌మెంట్ 2022 వివరాలు:
# AR - 9659 పోస్టులు
# BSF - 19254 పోస్టులు
# CISF- 10918 పోస్టులు
# CRPF - 29985 పోస్ట్‌లు
# ITBP- 3187 పోస్ట్‌లు
# SSB - 11402 పోస్ట్‌లు


Also Read: ఇదేందయ్యో ఇది.. పెట్రోల్ తక్కువగా ఉందని చలాన్ చేసిన ట్రాఫిక్ పోలీసులు!


Also Read: BJP MPS Protest: రాష్ట్రపతిని 'రాష్ట్రపత్ని' అని వ్యాఖ్యానించిన MP అధీర్ రంజన్.. క్షమాపణ చెప్పాలంటూ BJP ఎంపీల నిరసన


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook