Cash in drainage pipe: డ్రైనేజీ పైపులో లక్షల కొద్ది అవినీతి సొమ్ము.. ఏసీబీ సోదాల వీడియో వైరల్
Cash found in drainage pipes, viral video: కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా లక్ష్మీ దేవిలా భావించి పవిత్రంగా దాచుకుంటారు. కష్టపడకుండా వచ్చిన అవినీతి సొమ్మును సొమ్ములాగే చూస్తారు కానీ లక్ష్మీ దేవిలా చూడరని నిరూపించాడు ఓ అవినీతిపరుడు. అందుకే అప్పనంగా వచ్చిన అవినీతి ధనాన్ని డ్రైనేజీ పైపులో దాచిపెట్టాడు ఓ అవినీతిపరుడు.
Cash found in drainage pipes, viral video: కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా లక్ష్మీ దేవిలా భావించి పవిత్రంగా దాచుకుంటారు. కష్టపడకుండా వచ్చిన అవినీతి సొమ్మును సొమ్ములాగే చూస్తారు కానీ లక్ష్మీ దేవిలా చూడరని నిరూపించాడు ఓ అవినీతిపరుడు. అందుకే అప్పనంగా వచ్చిన అవినీతి ధనాన్ని డ్రైనేజీ పైపులో దాచిపెట్టాడు ఓ అవినీతిపరుడు. కర్ణాటకలోని కాలబుర్గిలో బుధవారం జరిగిని అవినీతి నిరోధక శాఖ సోదాల్లో ఈ ఘటన వెలుగుచూసింది. కర్ణాటక ఈశాన్య రేంజ్ ఏసీబీ ఎస్పీ మహేష్ మేఘన్ననవర్ ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు.
ఏసీబీ ఎస్పీ మహేష్ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శాంత గౌడ్ (ACB raids Shanta Gouda residence) ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జరిగిన సోదాల్లో రూ. 54 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి. కమిషన్ల కోసం కక్కుర్తిపడే శాంత గౌడ్ వేధింపులు తాళలేకపోయిన సివిల్ వర్క్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడి ఇల్లు, సమీప బంధువుల నివాసాలపై ఆకస్మిక దాడులు జరిపి సోదాలు చేపట్టారు.
Also read : Man killed by minor daughter : లైంగిక వేధింపులకు పాల్పడ్డ తండ్రిని హత్య చేసిన కూతురు
ఏసీబీ అధికారులు సోదాల కోసం (ACB raids in Karnataka) వచ్చి తలుపులు కొడుతున్నప్పటికీ.. శాంత గౌడ్ అతడి కొడుకు మాత్రం 15 నిమిషాల పాటు తలుపులు తీయకుండా లోపల ఉన్న ధనాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. వాషింగ్ బేషన్ నుంచి వెళ్లే డ్రైనేజ్ పైపులో వాళ్లు కుక్కిన రూ. 13 లక్షల నోట్ల కట్టలను ఏసీబీ అధికారులు తవ్వితీశారు. ఇంటిపై కప్పు సీలింగ్‌లోనూ నోట్ల కట్టలు (Cash bundles kept in ceiling) దాచిపెట్టినట్టు సందేహించిన అధికారులు సీలింగ్ పగలగొట్టి అందులోంచి 6 లక్షల రూపాయలు వెలికితీశారు.
శాంత గౌడ్ ఇంట్లో ధనాన్ని వెలికి తీయడం కోసం ఏసీబీ అధికారులు ఓ ప్లంబర్ సహాయం తీసుకోవాల్సి వచ్చిందంటే.. అతడి ఇంట్లో ఉన్న అవినీతి సొమ్మును తవ్వితీయడం కోసం అధికారులు ఎంత శ్రమించాల్సి వచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చింది 2 ఎకరాలు భూమి కాగా.. ప్రస్తుతం అతడు కాలబుర్గి (ACB raids on Kalaburagi PWD officer) సమీపంలో 35 ఎకరాలకు యజమాని అయ్యాడు. అదంతా అవినీతికి పాల్పడి సొమ్ము చేసుకున్నదే అని కాంట్రాక్టర్స్ ఆరోపిస్తున్నారు.
Also read : Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook