West Bengal Violence: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై విచారణ ప్రారంభం కానుంది. కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలో దిగిన సీబీఐ..విచారణకు సిద్ధమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో(Five state Elections) భాగంగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలు(West Bengal Elections)జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పెద్దఎత్తున హింస చెలరేగింది. హత్యలు, అత్యాచారాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై దర్యాప్తును కోల్‌కత్తా హైకోర్టు(Kolcutta High Court)సీబీఐకు అప్పగించింది. సీబీఐ అదనపు డైరెక్టర్ అజయ్ భట్నాగర్ పర్యవేక్షణలో జాయింట్ డైరెక్టర్ రమణీష్, అనురాగ్, వినీత్ వినాయక్, సంపత్ మీనా ఆధ్వర్యంలోని బృందాలు విచారణ చేపట్టనున్నాయి. మొత్తం నాలుగు బృందాల్లో కలిపి 28 మంది సభ్యులుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్నించి అధికారుల్ని రప్పించి ఈ బృందాల్లో నియమించారు. రాష్ట్రంలో జరిగిన హత్యలు, అత్యాచారాలకు సంబంధించి నమోదైన కేసుల వివరాల్ని ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీకు సీబీఐ(CBI)కోరింది. ఈ మేరకు లేఖ కూడా రాసింది. త్వరలో విచారణ ప్రారంభం కానుంది. 


Also read: Aadhaar-Epfo link: మీ పీఎఫ్ అక్కౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేశారా, ఇదే చివరి తేదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook