దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ వివాదంపై కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ... ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకుని దాడి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు. 


ఇదిలావుంటే, కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని లోధి రోడ్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. రఫేల్ డీల్‌పై సీబీఐ దర్యాప్తు మొదలుపడితే ప్రభుత్వం బండారం బయటపడుతుందనే భయంతోనే మోదీ సర్కార్ ఆలోక్ వర్మను తొలగించిందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.