CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..!
CBSE 10th Results: ఎట్టకేలకు సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కింది విధంగా చూడండి..
CBSE 10th Results: ఎంతో ఉత్కంఠను రేపిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10వ తరగతి ఫలితాలు వెలువడాయి. తాజాగా ఫలితాలను సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను తమ అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవచ్చని స్పష్టం చేసింది. cbseresults.nic.in, cbse.digitallocker.gov.in, cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. రోల్ నెంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నెంబర్ల ఆధారంగా ఫలితాలను చూసుకునే అవకాశం కల్పించారు.
ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా 7 వేల 046 సెంటర్లలో పరీక్ష జరిగింది. మొత్తం 21 లక్షల 16 వేల 209 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 8 లక్షల 94 వేల 993 మంది బాలికలు..12 లక్షల 21 వేల 195 మంది బాలురు ఉన్నారు. మరోవైపు ఉదయం సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడలయ్యాయి. రోల్ నెంబర్, పాఠశాల నెంబర్ ఆధారంగా ఫలితాలను చూసుకునేలా ఏర్పాట్లు చేశారు.
cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్లలో స్కోర్ కార్డులను చూసుకోవచ్చు. ఈఫలితాల్లో మొత్తం 92.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టర్మ్ 1,2 పరీక్షల మార్కుల వెయిటేజీ ఆధారంగా సీబీఎస్‌ఈ తుది ఫలితాలను తయారు చేశారు. విద్యా సంవత్సరంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రాక్టికల్ పరీక్షలు, ప్రీ-బోర్డు ఎగ్జామ్స్ ఆధారంగా మార్కులను రూపొందించారు. ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు జరిగాయి. మొత్తంగా సీబీఎస్‌ఈ 10, 12 ఫలితాలు ఒకే రోజు విడుదలయ్యాయి.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also read:Akasa Air: త్వరలో అందుబాటులోకి మరో విమాన సంస్థ..బుకింగ్ సర్వీసులు షురూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook