CBSE బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టెన్త్, ఇంటర్ బోర్డ్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, ఇంటర్ (12వ తరగతి) బోర్డు ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు. మార్చి 19న ప్రారంభం కావాల్సిన పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్‌ఈ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బుధవారం రాత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
UGC NET 2020 దరఖాస్తు చేసుకున్నారా.. అప్లై చేసుకోండి
భారత్‌తో పాటు విదేశాల్లోనూ సీబీఎస్ఈ నిర్వహించే 10వ తరగతి, ప్లస్ 2 బోర్డు పరీక్షలను మార్చి 31 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో కొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోన్నట్లు తెలుస్తోంది. కాగా మన దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలోనే సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9వేల మరణాలు సంభవించినట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.