CBSE New Affiliation system: సీబీఎస్ఈ గుర్తింపు ప్రక్రియలో కీలక మార్పులు, ఇకపై అంతా ఆన్‌లైన్
CBSE New Affiliation system: సీబీఎస్ఈ విద్యావిధానానికి సంబంధించి గుర్తింపు ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు చేపట్టినట్టు సీబీఎస్ఈ బోర్టు ప్రకటించింది.
CBSE New Affiliation system: సీబీఎస్ఈ విద్యావిధానానికి సంబంధించి గుర్తింపు ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా మార్పులు చేపట్టినట్టు సీబీఎస్ఈ బోర్టు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) గుర్తింపు ప్రక్రియ ( Affiliation system ) లో మార్పులు సంభవించాయి. సీబీఎస్ఈ పరిధిలో ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియ అంటే అఫిలియేషన్‌లో కీలక మార్పులు ( Changes in Cbse affiliation system ) చేసినట్టు సీబీఎస్ఈ బోర్డు ( CBSE Board ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానానికి ( National Education Policy 2020 ) అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు బోర్డు తెలిపింది. ఇక నుంచి గుర్తింపు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ బైలాస్‌లో పలు మార్పులు చేసింది బోర్డు. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ నోటిఫికేషన్ పొందుపర్చింది. 2021 మార్చ్ 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లో రానుందని..వివిధ కమిటీల సిఫార్సులు, నూతన విద్యా విధానంలో చేసిన సూచనలకు అనుగుమంగా ఈ మార్పులు చేసినట్టు సీబీఎస్ఈ పేర్కొంది.
సీబీఎస్ఈ గుర్తింపు ( CBSE Affiliation ) ఇచ్చేందుకు 2006 నుంచి ఆన్‌లైన్ విధానం అమలవుతోంది. ప్రస్తుతం పూర్తిగా డిజిటలైజేషన్, డేటా అనలటిక్స్ ఆధారంగా మానవ వనరుల్ని తక్కువగా ఉపయోగిస్తూ అఫిలియేషన్ ఇస్తున్నట్టు బోర్డు తెలిపింది. త్వరితగతిన గుర్తింపు, ఆటోమేటెడ్, డేటా ఆధారిత నిర్ణయాలు, పారదర్శకత, అక్కౌంటెబిలిటీ, నిర్ణీత గడువులోగా దరఖాస్తుల పరిష్కారం లక్ష్యంగా కొత్త విధానం చేపడుతున్నట్టు సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది. సంబంధిత విద్యాసంస్థలు ఇకపై అవసరమైన డాక్యుమెంట్లను సీబీఎస్ఈ వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
Also read: Online Rummy Apps: విరాట్ కోహ్లీ, తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook