CBSE Board Exam: దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టేట్ సిలబస్ కాకుండా ఏకీకృత విద్యా విధానంలో సీబీఎస్ఈ చాలా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ విద్యా విధానంలో కీలకమైన మార్పుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త సీబీఎస్ఈ విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీబీఎస్ఈ విద్యా విదానంలో 10, 12 తరగతులకు ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఏడాదిలో రెండు సార్లు మొత్త  సిలబస్ ఆధారంగా జనవరి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలుంటాయి. ఈ కొత్త విధానం వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి అమల్లోకి రానుంది. మొదటి బోర్డు పరీక్ష జనవరి 2026లో జరగనుంది. ఇక రెండవ బోర్డు పరీక్ష ఏప్రిల్ 2026లో ఉంటుంది. 


ఈ రెండు పరీక్షల్లో ఏది రాయాలనే విషయంపై విద్యార్ధులకు ఆప్షన్ ఉంటుంది. విద్యార్ధులు కావలిస్తే రెండు పరీక్షలు రాయవచ్చు లేదా ఏదో ఒక పరీక్ష ఎంచుకుని రాయవచ్చు. రెండూ రాసేవాళ్ళకు ఎందులో ఎక్కువ మార్కులొచ్చాయో ఆ మార్కుల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త విధానం అమలుకు కేంద్ర విద్యాశాఖ 10 వేలకు పైగా స్కూల్ ప్రిన్సిపల్స్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మూడు ప్రతిపాదనలను ఉంచింది. మొదటిది ఉన్నత విద్యాశాఖలో ఉన్నట్టుగా సెమిస్టర్ విధానం సెప్టెంబర్, మార్చ్ నెలల్లో నిర్వహించాలని, రెండవది మార్చ్ ఏప్రిల్ బోర్డు పరీక్ష ద్వారా సప్లిమెంటరీ పరీక్ష కాకుండా జూలైలో ఫుల్ బోర్డ్ పరీక్ష నిర్వహించాలని అనుకుంది. మూడవది జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్టుగా జనవరి, ఏప్రిల్‌లో రెండుసార్లు నిర్వహించాలనేది. అధిక శాతం ప్రిన్సిపాల్స్ మూడో ఆప్షన్ ఎంచుకున్నారు. 


సెమిస్టర్ విధానాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఇక జూలైలో సప్లిమెంటరీకు బదులు ఫుల్ బోర్డ్ పరీక్ష విధానం వల్ల విద్యార్ధులకు ఉపయోగం ఉండదనే కారణంతో అంతా నిరాకరించారు. ఈ విధానం వల్ల ఉన్నత విద్యలో అడ్మిషన్లకు ఆలస్యమైపోతుంది. 


పదో తరగతి, 12వ తరగతి విద్యార్ధులకు  కొత్త సిలబస్ ఆధారంగా పరీక్షలు నిర్వహించేందుకు మరో రెండేళ్ల సమయం పట్టనుంది. కొత్త సిలబస్ 2026-27 నుంచే అందుబాటులోకి రానుంది. అందుకే 2025-26 విద్యా సంవత్సరం నుంచి పాత సిలబస్ ఆధారంగా కొత్త విద్యా విధానం అమలు కానుంది. 


Also read: IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook