కరోనాకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ స్పూత్నిక్ వి (Sputnik V)ని రష్యా తీసుకొచ్చింది. అయితే ఈ టీకా పనిచేస్తే రష్యా ప్రజలు అదృష్టవంతులని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) డైరెక్టర్ డా. రాకేష్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణం లేకపోలేదు. తమ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఫేజ్3 పూర్తవకముందే హడావుడిగా స్పూత్నిక్ వి టీకాను తీసుకురావడం అందుకు కారణంగా తెలుస్తోంది. వ్యాక్సిన్ సంబంధించి రష్యా ఏ వివరాలు వెల్లడించలేదేదని, దాని పనితీరుపై అప్పడే ఓ అభిప్రాయానికి రాలేమన్నారు. ఒకవేళ రష్యాలో వ్యాక్సిన్ విఫలమైతే మరే ఇతర దేశం మూడో దశ ట్రయల్స్ ఫలితాలు రాకముందే టీకాలను ఆమోదించదన్నారు. Sputnik V‌: రష్యా కరోనా వ్యాక్సిన్‌పై ఎన్నో అనుమానాలు.. అందుకు కారణాలు! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Telangana: కొత్తగా 1,931 కరోనా కేసులు


తొలి కోవిడ్19 వ్యాక్సిన్‌ను తీసుకొచ్చామని రష్యా చెబుతున్నప్పటికీ.. టీకా తయారీలో మూడో దశ ట్రయల్స్ ఎంతో కీలకమని రాకేష్ మిశ్రా తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ మూడు దశలు పూర్తయ్యాక తేవాల్సిన టీకాను ముందుగా ఎలా అనుమతించారో అర్థం కావడం లేదన్నారు. పైగా కరోనా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు కొన్ని నెలల కిందట రష్యా కీలక ప్రకటనలు చేసిందని పీటీఐతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన గుర్తుచేశారు.  తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి 
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే


పలు దేశాలు క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 3లో ఉన్నాయని.. ఆ దశ దాటితేనే వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైనట్లు వెల్లడించారు. తొలి రెండు దశలలో ప్రయోగాలు దాదాపు సక్సెస్ అవుతాయని, వాటిని నమ్మి కరోనా వైరస్ లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...