Sputnik V‌: రష్యా కరోనా వ్యాక్సిన్‌పై ఎన్నో అనుమానాలు.. అందుకు కారణాలు!

  • Aug 12, 2020, 09:03 AM IST

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకురావాలని రష్యా యత్నిస్తోందని, ఇందులో భాగంగా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో ఫలితాలు రాకముందే రష్యా ఈ కరోనా వ్యాక్సిన్ స్పూత్నిక్ వి (Sputnik V) తీసుకొచ్చిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. మరోవైపు రష్యా వ్యాక్సిన్ తెచ్చినప్పటికీ వచ్చే ఏడాదికిగానూ అందుబాటులోకి రాదని ప్రకటించారు.

1 /7

మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ (Corona Vaccine) కోసం ప్రయత్నాలు చేస్తుంటే రష్యా తమ తొలి టీకాను నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ (Russia COVID-19 Vaccine)కు స్పూత్నిక్ వి (Sputnik V) అని రష్యా నామకరణం చేసింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌కు ర‌ష్యా ఆరోగ్య శాఖ ఆమోదం తెలపడంతో ‘స్పూత్నిక్ వి’ ప్రపంచంలోనే తొలి కోవిడ్19 వ్యాక్సిన్ అయింది.    కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా తీసుకురావాలని రష్యా యత్నిస్తోందని, ఇందులో భాగంగా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయి. క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో ఫలితాలు రాకముందే రష్యా ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చిందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. మరోవైపు రష్యా వ్యాక్సిన్ తెచ్చినప్పటికీ వచ్చే ఏడాదికిగానూ అందుబాటులోకి రాదని ప్రకటించారు.

2 /7

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ‘స్పూత్నిక్ వి’ (Sputnik V)ని తీసుకొచ్చిన రష్యా ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయలేదు. కానీ తొలి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా రిజిస్టర్ చేసింది.

3 /7

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తమదే కావాలన్న ఉద్దేశంతో ‘స్పూత్నిక్ వి’ తయారీలో తగిన ప్రమాణాలు పాటించలేదని, కొన్ని విషయాలను పక్కనపెట్టిందని ఆరోపణలున్నాయి. (Photo: india.com)

4 /7

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా తయారు చేయాలని రష్యా ప్రభుత్వం శాస్త్రవేత్తలపై ఒత్తిడి తీసుకువచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. త్వరగా కోవిడ్19 వ్యాక్సిన్ తేవడంతో సమస్యలు తలెత్తితే ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

5 /7

తాము రూపొందించిన తొలి కరోనా వ్యాక్సిన్ ‘స్పూత్నిక్ వి’ (Sputnik V)కి సంబంధించి ఏ శాస్త్రీయ సమాచారాన్ని రష్యా వెల్లడించలేదు. దీంతో రష్యా కరోనా వ్యాక్సిన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

6 /7

దశలవారీగా సక్సెస్ సాధిస్తేనే వ్యాక్సిన్‌ను కానీ మనుషులపై పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తవకముందే రష్యా తమ కోవిడ్19 వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మనుషులపై వ్యాక్సిన్ Sputnik V ప్రయోగం అంత మంచి పరిణామం కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

7 /7

ప్రపంచంలో ఓ దశలో అగ్రరాజ్యంగా వెలిగిన పూర్వ వైభవం కోసం రష్యా పాకులాడుతోంది. దీన్ని సైన్స్, మెడికల్ సబ్జెక్ట్ ప్రకారమైనా నిరూపించుకోవాలని యత్నించిందని విమర్శలు వస్తున్నాయి. అందుకే ట్రయల్స్ అన్ని ఫేజ్‌లు పూర్తవకున్నా వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేశారు. (Photo: DNA)