Amritpal Singh CCTV Footage: ఖలిస్థాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానాకు వెళ్లినట్టుగా పలు సీసీటీవీ దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను హర్యానాలో ఉన్నట్టు కనుకున్న పోలీసులు.. ఏ క్షణమైనా తనని వెదుక్కుంటూ రావొచ్చనే ఆలోచనతో అమృత్ పాల్ సింగ్ హర్యానా నుంచి ఉత్తరాఖండ్ కి మకాం మార్చినట్టు వార్తల్లో చూశాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా అమృత్ పాల్ సింగ్ తలకు టర్బన్ లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కనిపించినట్టుగా సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకొచ్చింది. ఆ సమయంలో అమృత్ పాల్ సింగ్ ప్రధాన అనుచరుడైన పపల్ ప్రీత్ సింగ్ కూడా అతడి వెంటే ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీ స్పష్టంచేస్తోంది. తలకు టర్బన్ లేకుండా పెరిగిన జుట్టును వీరబోసుకున్న అమృత్ పాల్ సింగ్.. ముఖానికి మాస్క్ ధరించి కనిపించాడు. అయితే, ఈ వీడియో మార్చి 21 నాటిది అని తెలుస్తోంది. 


ఢిల్లీలోని ఒక మార్కెట్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది అసలు అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరుడు పపల్ ప్రీత్ సింగేనా లేక అలా కనిపిస్తున్న మరొకరా అనే విషయాన్ని ధృవీకరించుకునే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. అంతేకాదు.. అసలు సీసీకెమెరాకు చిక్కినట్టుగా చెబుతున్న ఈ దృశ్యాలు కూడా అసలు ఢిల్లీ మార్కెట్ లోనివేనా లేక మరొక చోటివా అనే విషయాలను కూడా తాము ధృవీకరించుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పినట్టుగా పీటీఐ కథనం పేర్కొంది.


మార్చి 18న అమృత్ పాల్ సింగ్ జలంధర్ లో పోలీసుల నుంచి సినీ ఫక్కీలో దుస్తులు మారుస్తూ, వాహనాలు మారుస్తూ పరారైనప్పటి నుంచి అనేక రకాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఢిల్లీలో కనిపించినట్టుగా చెబుతున్న ఫుటేజ్ కూడా అలాంటిదేనా లేక నిజమైందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఘటనపై కోర్టుకు సమాధానం ఇస్తూ.. త్వరలోనే అమృత్ పాల్ సింగ్‌ని పట్టుకుంటాం అని తెలిపారు.


ఇది కూడా చదవండి : Chenab Railway Bridge: ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి పట్టాలెక్కిన మహింద్రా బొలెరో.. మంత్రి గారి కోసమే..


ఇది కూడా చదవండి : India Coronavirus: భయపెడుతున్న కరోనా.. గత 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే..?


ఇది కూడా చదవండి : Rahul Gandhi Issue: జైలు శిక్ష..సభ్యత్వం రద్దు..ఇప్పుడు బంగ్లా ఖాళీ, రాహుల్‌ని వెంటాడుతున్న కష్టాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK