Rahul Gandhi Issue: జైలు శిక్ష..సభ్యత్వం రద్దు..ఇప్పుడు బంగ్లా ఖాళీ, రాహుల్‌ని వెంటాడుతున్న కష్టాలు

Rahul Gandhi Issue: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వరుసగా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ముందు జైలు శిక్ష, తరువాత పార్లమెంట్ సభ్యత్వం రద్దు..ఇప్పుడు బంగ్లా ఖాళీ చేయాల్సి రావడం. మోదీ ప్రభుత్వం రాహల్ గాంధీని వెంటాడుతున్నట్టే కన్పిస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 28, 2023, 07:32 AM IST
Rahul Gandhi Issue: జైలు శిక్ష..సభ్యత్వం రద్దు..ఇప్పుడు బంగ్లా ఖాళీ, రాహుల్‌ని వెంటాడుతున్న కష్టాలు

Rahul Gandhi Issue: మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీని సమస్యల్లో పడేస్తున్నాయి. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష వేసిన వెంటనే..పార్లమెంట్ సెక్రటేరియట్ అతడి సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇప్పుడు తుగ్లక్ లేన్‌లో ఉన్న ఎంపీ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు అందాయి.

సూరత్ కోర్టు జైలు శిక్ష విధించడమే తరువాయి..ఆగమేఘాలపై పార్లమెంట్ సెక్రటేరియట్ రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ చర్యను కక్ష సాధింపు చర్యగా ప్రతిపక్షాలు, వైరి పక్షాలు కూడా అభివర్ణిస్తున్నా రాహుల్‌పై వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకదానివెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నాయి. కొత్తగా ఎంపీ బంగ్లా ఖాళీ చేయాల్సందిగా నోటీసులు జారీ అయ్యాయి.

అసలేం జరిగింది..

దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ ఎందుకుందంటూ 2019లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల  జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో రాహుల్ గాంధీకు బెయిల్ కూడా ఇచ్చిన కోర్టు ఎగువ కోర్టును ఆశ్రయించేందుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. అంటే న్యాయ ప్రక్రియకు వెసులుబాటు కల్పించింది. 

కానీ న్యాయస్థానం కల్పించిన న్యాయ ప్రక్రియ వెసులుబాటును ఉపయోగించుకునే అవకాశం లేకుండానే సూరత్ కోర్టు తీర్పుపై ఆగమేఘాలపై పార్లమెంట్ సెక్రటేరియట్ స్పందించింది. రెండేళ్ల జైలుశిక్ష కారణంగా చూపిస్తూ.. ప్రజా ప్రతినిధుల చట్టాన్ని బయటకు తీసి..పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తన నిర్దోషిత్వం రుజువు చేసుకోకపోతే 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోతారు. 

రాహల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని ఆగమేఘాలపై అంత హడావిడిగా రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే మరో చర్యకు పాల్పడింది. పార్లమెంట్ సభ్యత్వం రద్దయినందున..తక్షణం ఆయన ఉంటున్న 12 తుగ్లక్ లేన్‌లోని ఎంపీ బంగ్లాను ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదంతా కక్షసాధింపు చర్యలని ప్రతిపక్షం మండిపడుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ వ్యవహారంపై ఉద్యమించేందుకు సిద్ధమౌతున్నారు.  

Also read: Helicopter Crashing video: టేకాఫ్ అవడంతోనే కూలిపోయిన హెలీక్యాప్టర్.. లైవ్ వీడియో దృశ్యాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News