India Coronavirus: భయపెడుతున్న కరోనా.. గత 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే..?

Coronavirus Cases Today: కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో  1573 కేసులు నమోదయ్యాయి. సోమవారం 1590 కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 05:42 PM IST
India Coronavirus: భయపెడుతున్న కరోనా.. గత 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే..?

Coronavirus Cases Today: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1573 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు. 14 రాష్ట్రాల్లోని 32 జిల్లాల్లో ప్రతివారం పాజిటివిటీ రేటు 10 శాతం దాటినందున.. కేంద్రం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

దేశంలోని 32 జిల్లాల్లో పాజిటివిటీ 10 శాతం దాటింది. ఈ సంఖ్య రెండు వారాల్లో 3.5 రెట్లు పెరిగింది. రెండు వారాల క్రితం కేవలం 9 జిల్లాల్లో మాత్రమే వారానికి 10 శాతం పాజిటివిటీ రేటు ఉండగా.. 8 రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో వీక్లీ పాజిటివ్ రేటు 5 నుంచి 10 శాతంగా ఉంది. ఇప్పుడు 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 63 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతానికి పెరిగింది.

మరోవైపు కరోనా వైరస్ XBB1.16 కొత్త వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 610 కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నుంచి వచ్చిన డేటా ప్రకారం.. ఈ కేసులన్నీ 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గుర్తించారు. కొత్త వేరియంట్ XBB1.16  కేసులు మహారాష్ట్రలో 164, గుజరాత్‌లో 164, తెలంగాణలో 93, కర్ణాటకలో 86 నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త రకం వైరస్ సోకిన రోగులలో సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతోపాటు కొన్ని సందర్భాల్లో సరిగా ఊపిరి ఆడకపోయినట్లు అనిపిస్తుందన్నారు.  

దేశంలో కొత్త కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. RT-PCR టెస్టులు పెంచాలని సూచించింది. కరోనా సోకిన వ్యక్తులను హోమ్ క్వారంటైన్ విధిస్తూ.. ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సన్నద్ధతను పరిశీలించడానికి ఏప్రిల్ 10, 11వ తేదీలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.

Also Read: Pan Aadhaar Link: బిగ్ రిలీఫ్.. పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..   

Also Read: TSRTC: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News