CDAC Jobs: బీటెక్ పాస్ అయిన నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? లేక ఐటి జాబ్స్ వేటలో ఉన్నారా? అయితే  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీకు ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటర్ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఈ నోటిఫికేషన్ కింద సుమారు 857 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీటెక్ లేదా బీఈ ,ఎంటెక్ లేదా ఎంఈ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో గ్రాడ్యూయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులుగా పేర్కొన్నారు. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు గాను పీహెచ్డీని అర్హతగా పేర్కొన్నారు. ఆసక్తి కల అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపవచ్చు. ఈ దరఖాస్తులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు అదేవిధంగా పోస్టుల వివరాలు వయోపరిమితి వంటి ఇతర అర్హతల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. 


పోస్టులు ఇవే:


C-DAC ప్రకటించిన ఈ ఉద్యోగాలకు  ఫ్రెషర్స్ నుండి అనుభవజ్ఞులైన అభ్యర్థుల వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ డెలివరీ మేనేజర్/ప్రోగ్రామ్ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్/సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ లీడర్/మాడ్యూల్ లీడర్‌తో సహా ఇతర నాన్-టెక్నికల్ పోస్టులపై ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. 


నాన్-టెక్నికల్ పోస్టులలో ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్/ప్రాజెక్ట్ ఆఫీసర్  ఖాళీ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఖాళీకి సంబంధించిన ఇతర వివరాలను చూడవచ్చు.


Also Read :Gold Rate Today:శ్రావణ మాసంలో బంగారం కొంటున్నారా? తరుగు,మజూరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?


విద్యార్హతలు ఇవే:


-టెక్నికల్ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BE/B.Tech లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి.


- సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా సంబంధిత డొమైన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/MBA.
M.E/M.Tech లేదా తత్సమాన డిగ్రీ. PHD కలిగి ఉండాలి.


- నాన్ టెక్నికల్ పోస్టుల కోసం  కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేట్.
CA/LLM/CS వంటి సంబంధిత రంగంలో రెండేళ్ల పూర్తి సమయం లేదా MBA/ సంబంధిత రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అర్హత ఉండాలి. 


దరఖాస్తు విధానం: 


-ముందుగా www.cdac.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.


 -తర్వాత మీరు కెరీర్ విభాగానికి వెళ్లాలి.


-ఇప్పుడు మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.


-దరఖాస్తు ఫారమ్‌లో అన్ని వివరాలను పూరించిన తర్వాత, అవసరమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయండి.


 -ఫారమ్ తుది సమర్పణ తర్వాత, ప్రింట్ అవుట్ తీసుకోండి.


Also Read : Rule Change From 1st August: ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నియమాలు..!


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి