జనవరి 26ను పుసర్కించుకొని దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడకలు ఘనంగా నిర్వహించారు. ఇండియాగేట్ దగ్గర అమర జవాన్లను నివాళులు అర్పించారు. రాజ్ పథ్ లో భారత రాష్ట్రపతి జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యకర్మానికి హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ హాజరయ్యారు. కాగా ఈ వేడకలను ముఖ్య అతిధిగా హాజరైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నారీ శక్తి ప్రత్యేక ఆకర్షణ


ఈ వేడుకల్లో  భాగాంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిచారు. కాగా పరేడ్ లో "నారీశక్తి" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అస్సోం రైఫిల్స్‌ను మహిళలు లీడ్ చేస్తున్నారు.అంతకుముందు ఇండియా గేట్‌ వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద ప్రధాని సహా త్రవిధ దళాల అధిపతులు పుష్పాంజలి ఘటించారు.


నజీర్ అహ్మద్ కు అశోక చక్ర పురస్కారం


ఈ సందర్భంలో ఒకరికి అశోక చక్ర ఇద్దరిని కీర్తి చక్ర పురస్కారాలు సహా మొత్తం 308 సైనికులకు శౌర్య పురస్కారాలు అందించారు. అమర సైనికుడు లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వానీకి అశోక్ చక్ర పురస్కారం దక్కింది.  రాష్ట్రపతి కోవింద్ అశోక చక్ర పురస్కారాన్ని  నజీర్ అహ్మద్ వానీ సతీమణికి అందజేశారు