Aerosols: ఏరోసోల్స్ పది మీటర్లు ప్రయాణిస్తాయిట..తస్మాత్ జాగ్రత్త
Aerosols: కరోనా మహమ్మారి గాలి ద్వారా సంక్రమిస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో కేంద్రం మరికొన్ని కీలకాంశాల్ని వెల్లడించింది. ఏరోసోల్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. 2 మీటర్ల దూరం సరిపోదిక..దో గజ్ దూరీ స్లోగన్ మార్చుకోవల్సిందే మరి.
Aerosols: కరోనా మహమ్మారి గాలి ద్వారా సంక్రమిస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో కేంద్రం మరికొన్ని కీలకాంశాల్ని వెల్లడించింది. ఏరోసోల్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. 2 మీటర్ల దూరం సరిపోదిక..దో గజ్ దూరీ స్లోగన్ మార్చుకోవల్సిందే మరి.
కరోనా సంక్రమణ(Coronavirus spread) గాలిద్వారా ఉంటుందనే శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే ఆందోళన కల్గిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం ( Principal Scientific Advisory office) విడుదల చేసిన మార్గదర్శకాల్ని వింటే మరింత ఆందోళన కలుగుతుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై దో గజ్ దూరీ స్లోగన్ మార్చుకోవల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా మనం తుమ్మినప్పుడు,.లేదా దగ్గినప్పుడు తుంపర్లు రెండు మీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తాయని తెలుసు. కానీ ఏరోసోల్స్(Aerosols) అంటే అతి సూక్ష్మమైన తుంపర్లు మాత్రం ఏకంగా పది మీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తాయనేది కొత్తగా చెబుతున్న కీలకమైన విషయం. అంటే ఇక రెండు మీటర్ల దూరం కాదు..పది మీటర్ల దూరం పాటించాల్సిందేనేమో.
అందుకే వైరస్ కట్టడికై డబుల్ మాస్క్(Double Mask), భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని కేంద్రం కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇళ్లలో వెంటిలేషన్‌ను పెంచుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సంక్రమించే ముప్పువు సరైన వెంటిలేషన్ తగ్గిస్తుంది. ఇంట్లో ఉండే కిటికీలు, తలుపులు వంటి ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో చెడు వాసన బయటకు వెళ్తుంది. అదే ప్రాంతంలో ఫ్యాన్ ఉంటే..వైరస్‌తో కూడిన గాలి బయటకు పోయి..కోవిడ్ ముప్పును తగ్గిస్తుంది. ఎటువంటి కరోనా లక్షణాల్లేని వ్యక్తులు కూడా వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. సాధారణంగా కరోనా బారిన పడిన వ్యక్తి నుంచి విడుదలయ్యే లాలాజలం, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు, ఏరోసోల్స్ రూపంలో ఉండే అతి సూక్ష్మ తుంపర్లు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకాలుగా ఉంటాయి. అందుకే ఇంట్లో నేల, తలుపు, హ్యాండిల్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. అస్తమానూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
ఏరోసోల్స్ పది మీటర్ల వరకూ(Aerosols can travel 10 metres) ప్రయాణిస్తాయి కాబట్టి..మూసి ఉన్న గదుల్లో ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే వెంటిలేషన్(Ventilation) బాగా ఉండాలి. తలుపులు , కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉంచాలి. సర్జికల్ మాస్క్‌తో కాటన్ మాస్క్ కలిపి పెట్టుకోవడం ఉత్తమమైన పద్థతి.
Also read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook