Rajyasabha Elections: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ సహా పది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఖాళీ కానున్న పది రాజ్యసభ స్థానాలకు జూలై 24వ తేదీన ఎన్నికలు కూడా జరిపేందుకు ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వానికి త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలు ఓ పరీక్షలా మారాయి. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ సహా పది మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది జూలై-ఆగస్టు మధ్యకాలంలో ఈ పది స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి జూలై 24వ తేదీన ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్నించి ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి.


ఇందులో పశ్చిమ బెంగాల్ నుంచి 6 స్థానాలు, గుజరాత్ నుంచి 3, గోవాలో 1 స్థానం ఖాళీ కానున్నాయి. ఈ పది రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జూలై 6న విడుదల కానుంది. జూలై 13 వరకూ నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. జూలై 17 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంటుంది. ఇక జూలై 24న పోలింగ్ జరగనుంది. అయితే ఈ పదిమందిలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ కూడా ఉండటంతో మరోసారి అవకాశమిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. కేంద్ర విదేశాంగ మంత్రిగా అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారనేది బీజేపీ వర్గాల మాట. ఈ క్రమంలో మరోసారి అవకాశముంటుందని తెలుస్తోంది. 


పశ్చిమ బెంగాల్ నుంచి ఖాళీ అవుతున్న 6 రాజ్యసభ స్థానాల్లో డెరెక్ ఓబ్రియెన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేంద్ర శేఖర్ రాయ్ ఉన్నారు. గుజరాత్ నుంచి ఖాళీ అవుతున్న 3 స్థానాల్లో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, దినేష్ జెమల్ భాయ్ అనవాదియా, లోఖండ్ వాలా జుగల్ సింగ్ ఉన్నారు. ఇక గోవా నుంచి ఖాళీ అయ్యే స్థానం నుంచి వినయ్ డీ టెండూల్కర్ ప్రాతినిద్యం వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. రాజస్థాన్‌లోని 3 స్థానాల్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంది.  


Also read: Air India Flight News: ప్రయాణికుడు దారుణ ప్రవర్తన.. ఫ్లైట్‌లోనే మల, మూత్ర విసర్జన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook