Bonus To Central Government Employees | పండగ సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ( Central Government) తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఒక నివేదిక ప్రకారం 17 లక్షల ఉత్పాదేతర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.2,791 కోట్ల బోనస్ ప్రకటించింది. వీరితో పాటు మరో 13 లక్షల మంది ఉద్యోగులకు మొత్తంగా రూ.906 కోట్ల బోనస్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. అంటే 30 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.3,737 కోట్ల బోనస్ రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



బోనస్ ఎవరికంటే...
ఈ బోనస్ దొరికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో రైల్వే ( Railways), పోస్ట్ ఆఫీస్, డిఫెన్స్, EPFO, ESIC వంటి 16.97 లక్షల ఉద్యోగులకు లభిస్తుంది. వీరికి ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ అందిస్తారు. మిగతా 13.70 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లభిస్తుంది.



పండగ సమయంలో ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయాలి అని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మధ్యతరగతి ప్రజల చేతిలో డబ్బు చేరితే మార్కెట్ పుంజుకుంటుంంది అని ప్రభుత్వం భావిస్తోంది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR