YouTube Channels: పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం, బ్లాక్ చేసిన జాబితాలో ఇండియా ఛానెళ్లు కూడా
YouTube Channels: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, విదేశీ సంబంధాల విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో ఆ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.
YouTube Channels: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, విదేశీ సంబంధాల విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయనే కారణంతో ఆ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది.
యూట్యూబ్ ఛానెళ్ల విషయంలో కేంద్ర సమాచచార, ప్రసార శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలు, ప్రజల శాంతికి సంబంధించి తప్పుడు సమాచారం విస్తరింపజేస్తున్నాయనేది ప్రధార కారణం. ఈ కారణంతో 18 దేశీయ ఛానెళ్లు, 4 పాకిస్తాన్ ఛానెళ్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించేందుకు..వివిధ టీవీ ఛానెళ్ల లోగోల్ని ఉపయోగించాయని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. యూట్యూబ్ ఛానెళ్లతో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, న్యూస్ వెబ్‌సైట్‌ను కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ల వీక్షకుల సంఖ్య 260 కోట్లకు పైగా ఉంది. సున్నితమైన విషయాల్ని సోషల్ మీడియాపై తప్పుడు విధంగా ప్రసారం చేశాయనే ఆరోపణలున్నాయి.
2021 ఫిబ్రవరిలో కొత్త ఐటీ నిబంధనలు విధించిన తరువాత యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. గత కొద్దిరోజులుగా తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జాతీయ భద్రత, ప్రజా శ్రేయస్సకు సంబంధించి కొన్ని ఛానెళ్లు, సోషల్ మీడియా ఖాతాల్ని బ్లాక్ చేయాలని గతంలోనే కేంద్ర సమాచార శాఖ ఆదేశించింది.
Also read: Madura Meenakshi: రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook