Madura Meenakshi: రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు..

రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు  ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 12 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 05:17 PM IST
  • కోరిన కోర్కెలు తీర్చే మధుర మీనాక్షి అమ్మవారు
  • రెండేళ్ల అనంతరం మదుర మీనాక్షి చిత్తిరై ఉత్సవాలు
  • 12 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
Madura Meenakshi: రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు..

Madura Meenakshi Chittirai Festival: రెండేళ్ల తరువాత మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు  ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 12 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.  మీనాక్షి, సుందరేశ్వరస్వామి రాత్రి వేళల్లో వేర్వేరు వాహనాల్లో మాడ వీధుల్లో విహరించనున్నారు. అయితే ఉత్సవాల్లో ప్రధానాంశాలైన మధుర మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం 12న జరగనుంది. అలాగే, 14వ తేదీ తమిళ సంవత్సరం రోజున మీనాక్షి-సుందరేశ్వరర్‌ తిరువివాహం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం పశ్చిమ, దక్షిణ వీధుల కూడలిలోని వివాహమండపంలో అమ్మవారి కల్యాణోత్సవం జరుగనుంది. 

ఆలయ అధికారులు  భారీ పందిళ్లు ఏర్పాటుచేశారు.అయితే ఈ అమ్మవారి  తిరుకల్యాణం రోజున భక్తుల సౌకర్యార్ధం రూ.200, రూ.500 దర్శన టిక్కెట్లతో పాటు, దక్షిణ గోపురం గుండా ఉచిత దర్శనానికి 12 వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు ఆలయ అధికారులు. టిక్కెట్లను భక్తులు www.maduraimeenakshi.Org అనే వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. మీనక్షి తిరుకల్యాణం అనంతరం పుష్ప పల్లకీలో వీధుల్లో విహరించనున్నారు. తారువాత 15వ తేది రథోత్సవం, 16న తీర్థవారి జరుగుతుందని ఆలయ ట్రస్టీ కరుముత్తు కన్నన్‌, జాయింట్‌ కమిషనర్‌ చెల్లదురైలు  తెలిపారు.

అయితే ఈ అమ్మవారికి పాండ్యరాజు నుంచి చరిత్ర ఉంది. పంచ శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠము ఎంతో ప్రముఖమైనది. అయితే ఆకుపచ్చ, నీలము కలగలిపిన మరకత మణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత.గంతలో మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని కులదేవతగా, తమ ఆడపడుచుగా, జగజ్జననిగా ఆరాధించే వారు.  మీనాక్షిని దేవీ భాగవతపురాణములో మణి ద్వీపవర్ణనలా  పాండ్య రాజులు ఆ ఆలయాన్ని నిర్మించారు.

తమిళనాడు రాష్ట్రంలోని  ఇది రెండో అతి పెద్ద నగరమైన మదురైలో ఈ దేవాలయం ఉంది.  ఈ దేవాలయానికి 2500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడిందని సమాచారం. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు మదురై నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు. అయితే ఈ దేవాలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు. కాంస్యం, నల్లరాతితో ఉన్న ఆర్ట్ గ్యాలరీ ఆలయాన్ని చూసేవారికి కనువిందు చేస్తుంది. శుక్రవారం రోజుల్లో భక్తులతో ఆలయం రద్దీగా ఉంటుంది. అయితే ఆలయంలో ఊంజల మండపం వద్ద ఇరువైపులా ఉన్న దేవతలు ప్రతి శుక్రవారం రోజు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా పూజించేవారన్న కథ కూడా ప్రచారంలో ఉంది.

Also Read: AP New Districts: 26 కాదు 27.. ఏపీలో మరో జిల్లా విభజనకు జగన్ సర్కార్ సమాలోచన?

Also Read: Maxwell Join RCB: ఆర్సీబీ శిబిరంలో చేరిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News