YouTube Channels Banned: తప్పుడు వార్తల ప్రసారం.. 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం..!
Youtube news channel ban: భారత్‌పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కన్నెర్ర జేసింది. పాకిస్థాన్ కు చెందిన 6 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లతో సహా 16 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది.
Youtube news channel ban: భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రప్రభుత్వం నిషేధం (Youtube news channel ban) విధించింది. ఇందులో పాకిస్థాన్ కు చెందిన ఆరు న్యూస్ ఛానెళ్లు ఉండటం విశేషం. మిగతా 10 భారత ఆధారిత యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్. భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ కు సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో ఈ ఛానెళ్లలు తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న నేపథ్యంలో.. కేంద్రం వీటిని బ్లాక్ చేసింది. వీటితోపాటు ఓ ఫేస్బుక్ ఖాతాను కూడా బ్లాక్ చేశారు అధికారులు. ఈ యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ఫేస్బుక్ ఖాతాకు మొత్తంగా 68 కోట్ల వీక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే కారణంతో ఈ నెల ప్రారంభంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇందులో కూడా 4 యూట్యూబ్ ఛానళ్లు పాకిస్థాన్ కు (Pakistan Youtube news channels) చెందినవి. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెళ్ల వీక్షకులు సంఖ్య 260కోట్లకు పైగా ఉండటం విశేషం. ఇవి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించిన నేపథ్యంలో.. ఈ చర్యలకు ఉపక్రమించాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఐటీ నిబంధనలు, 2021 నోటిఫికేషన్ తర్వాత యూట్యూబ్ ఆధారిత వార్తా ప్రచురణకర్తలపై చర్య తీసుకోవడం ఇదే తొలిసారి.
Also Read: Gautam Adani: వారెన్ బఫెట్‌ను అధిగమించిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం!
భారతీయ ఆధారిత యూట్యూబ్ ఛానెల్‌లు: 10
సైనీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (Saini Education Research)
హిందీ మే దేఖో (Hindi Mein Dekho)
టెక్నికల్ యోగేంద్ర (Technical Yogendra)
ఆజ్ తే న్యూస్ (Aaj te news)
ఎస్బీబీ న్యూస్ (SBB News)
రక్షణ వార్తలు 24x7 (Defence News24x7)
ది స్టడీ టైం (The study time)
లేటేస్ట్ అప్ డేట్ (Latest Update)
ఎమ్ఆర్ఎఫ్ టీవీ లైవ్ (MRF TV LIVE)
తహఫుజ్-ఇ-దీన్ ఇండియా (Tahaffuz-E-Deen India)
పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ ఛానెల్‌లు: 6
అజ్‌తక్ పాకిస్థాన్ (AjTak Pakistan)
డిస్కవర్ పాయింట్ (Discover Point)
రియాలిటీ చెక్స్ (Reality Checks)
కైజర్ ఖాన్ (Kaiser Khan)
ది వాయిస్ ఆఫ్ ఆసియా (The Voice of Asia)
బోల్ మీడియా బోల్ (Bol Media Bol)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.